
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
లాడర్‌హిల్ (అమెరికా): మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్‌హిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. సిరీస్‌లో యువ రక్తంతో బరిలో దిగుతున్న భారత జట్టు నవదీప్ సైనీకి అరంగేట్రం అవకాశమిచ్చింది. బ్యాటింగ్‌లో మనీశ్ పాండేను పరీక్షిస్తూ, కీపింగ్‌లో రిషభ్ పంత్‌పై పూర్తి బాధ్యత మోపుతూ, బౌలింగ్‌లో నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్‌ను ప్రయోగిస్తూ తొలి మ్యాచ్ ఆరంభించనుంది. కేఎల్ రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. శ్రేయస్ అయ్యర్ కూడా రిజర్వు బెంచ్‌కే పరిమితయ్యాడు.
జట్లు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మనీష్ పాండే, పంత్, కృనాల్, జడేజా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్, సైనీ
విండీస్: బ్రాత్‌వైట్(కెప్టెన్), పొలార్డ్ క్యాంప్‌బెల్, లూయిస్, హేట్‌మేయర్, పావెల్, బ్రాత్‌వైట్, నరైన్, కాట్రెల్, పాల్, థామస్