
కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న సైనీ ఐదో ఓవర్‌లో హెయిట్‌మేర్, నికోలస్ పూరన్ వికెట్లు తీసి ఔరా..! అనిపించాడు.
లాడర్‌హిల్ (అమెరికా): వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు విజృంభించారు. వారి ధాటికి ఆరు ఓవర్లకే విండీస్ 5 వికెట్లు కోల్పోయింది. నవదీప్ సైనీ రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ తీసి విండీస్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. జట్టు ఖాతా తెరవక ముందే ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్‌ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయగా.. తదుపరి ఓవర్‌లో ఎవిన్ లూయిస్‌ను భువనేశ్వర్ పెవిలియన్ చేర్చాడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న సైనీ ఐదో ఓవర్‌లో హెయిట్‌మేర్, నికోలస్ పూరన్ వికెట్లు తీసి ఔరా..! అనిపించాడు. ఆరో ఓవర్‌లో రోవ్‌మన్ పోవెల్‌ను ఖలీల్ ఔట్ చేయడంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 10 ఓవర్లకు 45/5తో ఆడుతోంది. కీరన్ పోలార్డ్ (10), బ్రాత్‌వైట్ (4) క్రీజులో ఉన్నారు. ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌట్ కావడం విశేషం.