తమిళనాడును గెలిపించిన సుందర్‌  | Tamil Nadu won by 5 wickets in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

తమిళనాడును గెలిపించిన సుందర్‌ 

Published Wed, Jan 24 2018 1:56 AM | Last Updated on Wed, Jan 24 2018 1:56 AM

Tamil Nadu won by 5 wickets in Uttar Pradesh - Sakshi

కోల్‌కతా: వాషింగ్టన్‌ సుందర్‌ (2/32, 33 పరుగులు) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో తమిళనాడు 5 వికెట్ల తేడాతో ఉత్తరప్రదేశ్‌పై గెలిచింది. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ సూపర్‌ లీగ్‌లో మంగళవారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ (యూపీ) 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్‌ సురేశ్‌ రైనా (41 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ జోరు కొనసాగించాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లి (7,068)ను వెనక్కి నెట్టి రైనా టి20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు (7,114) చేసిన భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.

తర్వాత తమిళనాడు 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. సంజయ్‌ యాదవ్‌ (52; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, భరత్‌ శంకర్‌ 30 పరుగులు చేశాడు.  ఇతర మ్యాచ్‌ల్లో బెంగాల్‌   3 పరుగుల తేడాతో ఢిల్లీపై, జార్ఖండ్‌ 4 వికెట్ల తేడాతో పంజాబ్‌పై, రాజస్తాన్‌ 22 పరుగుల తేడాతో కర్ణాటకపై గెలుపొందాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement