వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 91 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.
సిడ్నీ:వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్లో టీమిండియా 91 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. రోహిత్ శర్మ(34) మూడో వికెట్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. అంతకుముందు విరాట్ కోహ్లీ(1), శిఖర్ ధావన్ (45) లు పెవిలియన్ కు చేరిన సంగతి తెలిసిందే.
18 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఆసీస్ విసిరిన 329 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన టీమిండియా పవర్ ప్లేలో ఆకట్టుకున్పప్పటికీ ఆ తరువాత వెనువెంటనే కీలక వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.