సెమీస్‌లో సాకేత్-సనమ్ జోడీ | Tennis players Saket, Sanam | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్-సనమ్ జోడీ

Oct 29 2015 2:01 AM | Updated on Sep 3 2017 11:38 AM

సెమీస్‌లో సాకేత్-సనమ్ జోడీ

సెమీస్‌లో సాకేత్-సనమ్ జోడీ

ఆద్యంతం సమన్వయంతో ఆడిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో...

ఏటీపీ చాలెంజర్ టోర్నీ
పుణే: ఆద్యంతం సమన్వయంతో ఆడిన సాకేత్ మైనేని-సనమ్ సింగ్ (భారత్) జంట పుణే ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సాకేత్-సనమ్ ద్వయం 6-2, 6-3తో జెర్మయిన్ గిగూనన్-యానిక్ మెర్టెన్స్ (బెల్జియం) జోడీపై విజయం సాధించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సాకేత్ జంట ఏకంగా 13 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.

మరోవైపు సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... ఇతర భారత ఆటగాళ్లు విష్ణువర్ధన్, సుమీత్ నాగల్, సనమ్ సింగ్, రామ్‌కుమార్ రామనాథన్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ రెండో రౌండ్‌లో ఓడిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement