ఆర్చరీలో తుది పోరుకు | The final shot archary | Sakshi
Sakshi News home page

ఆర్చరీలో తుది పోరుకు

Published Sat, Aug 24 2013 1:36 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM

The final shot archary

 వ్రోక్లా (పోలాండ్): వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన భారత మహిళా ఆర్చర్లు టీమ్ విభాగంలో రాణించారు. ప్రపంచ కప్ ఆర్చరీ టోర్నమెంట్‌లో రికర్వ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు.
 
 శుక్రవారం జరిగిన ఈ విభాగం పోటీల్లో దీపిక కుమారి, రిమిల్ బురులీ, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం ఫైనల్‌కు చేరింది. తొలి రౌండ్‌లో భారత్ 217-216తో ఇండోనేసియాను ఓడించాక... క్వార్టర్ ఫైనల్లో 211-202తో మెక్సికోపై గెలిచింది. సెమీఫైనల్లో టీమిండియా 214-206తో డెన్మార్క్‌పై విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో టాప్ సీడ్ దక్షిణ కొరియా జట్టుతో భారత్ తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement