భారత కుర్రాళ్లదే సిరీస్‌ | The Indian Under-19 team retained five ODIs with 3-0 in the two matches remaining | Sakshi
Sakshi News home page

భారత కుర్రాళ్లదే సిరీస్‌

Published Sun, Aug 13 2017 1:17 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

భారత కుర్రాళ్లదే సిరీస్‌

భారత కుర్రాళ్లదే సిరీస్‌

మూడో మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్‌పై జయభేరి  
హోవ్‌: భారత అండర్‌–19 జట్టు మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ఐదు వన్డేల సిరీస్‌ను 3–0తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన మూడో వన్డేలో భారత యువ జట్టు 169 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ అండర్‌–19 జట్టుపై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది.

శుభ్‌మాన్‌ గిల్‌ (127 బంతుల్లో 147; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకం సాధించాడు. జిగ్నేశ్‌ పటేల్‌ (38), అభిషేక్‌ శర్మ (31) ఫర్వాలేదనిపించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో మ్యాటీ పాట్స్‌ 4 వికెట్లు పడగొట్టగా, జాక్‌ ప్లామ్, ట్రెవస్కిస్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 40.5 ఓవర్లలో 158 పరుగుల వద్ద ఆలౌటైంది. బాంటన్‌ (59; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. భారత బౌలర్లలో నాగర్‌కోటి 3, అభిషేక్‌ శర్మ, శుభ్‌మాన్‌ గిల్‌ చెరో 2 వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement