ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి | Two players die at world chess championship in Norway | Sakshi
Sakshi News home page

ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి

Published Fri, Aug 15 2014 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి

ప్రపంచ చెస్ పోటీలలో ఇద్దరు ఆటగాళ్ల మృతి

ఓస్లో: నార్వేలో జరుగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్ షిప్ లో అపశృతి చోటు చేసుకుంది. ప్రపంచ చాంపియన్ షిప్ లో పాల్గొంటున్న ఇద్దరు ఆటగాళ్లు మృత్యువాత పడ్డారు. సీషెల్స్ కు చెందిన 60 ఏళ్ల ఆటగాడు ఆట మధ్యలోనే కుప్పకూలాడు. కూప్పకూలిన ఆటగాడిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలయ్యాయి. 
 
ఈ ఘటన పోటీల ఫైనల్ రోజు గురువారం చోటు చేసుకుంది. అయితే ఆదే రోజు ఉజ్బెకిస్థాన్ కు చెందిన మరో ఆటగాడు హోటల్ గదిలో మరణించాడు. ఇద్దరు ఆటగాళ్లు మరణించడం చాలా విషాదకరం అని పోటీలకు సంబంధించిన ప్రతినిధి మీడియాకు వెల్లడించారు. 
 
ఆటగాళ్ల మృతి వెనుక ఎలాంటి అనుమానాలు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ పోటీల్లో చైనా చాంఫియన్ గా అవతరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement