గాజి మాయాజాలం | Under-19 tri-series: Saleh Ahmed Shawon Ghazi spins Bangladesh to victory over Afghanistan | Sakshi
Sakshi News home page

గాజి మాయాజాలం

Published Mon, Nov 23 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

గాజి మాయాజాలం

గాజి మాయాజాలం

* అఫ్ఘాన్‌పై బంగ్లా గెలుపు
* అండర్-19 ముక్కోణపు సిరీస్
కోల్‌కతా: స్పిన్నర్ సలే అహ్మద్ షాన్ గాజి (7.4-2-10-6) మాయాజాలానికి అండర్-19 ముక్కోణపు సిరీస్‌లో అఫ్ఘానిస్తాన్ విలవిలలాడింది. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల తేడాతో అఫ్ఘాన్‌పై విజయం సాధించింది. జాదవ్‌పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది.

హజ్రతుల్లా (32), ఇసానుల్లా (14) ఓ మాదిరిగా ఆడినా.. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఆరో ఓవర్‌లోనే స్పిన్నర్‌ను తేవడంతో అఫ్ఘాన్ పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో 8 మంది బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. హసన్ మిరాజ్ 2, సయీద్ సర్కార్ ఒక్క వికెట్ తీశారు. తర్వాత బంగ్లాదేశ్ 34.3 ఓవర్లలో 6 వికెట్లకు 89 పరుగులు చేసి నెగ్గింది. సైఫ్ హసన్ (32) టాప్ స్కోరర్.

నజ్ముల్ హుస్సేన్ (19), జాకిర్ హసన్ (13) ఫర్వాలేదనిపించారు. జియావుర్, కరీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ ఖాతాలో ఐదు పాయింట్లు చేరాయి. సోమవారం విశ్రాంతి దినం తర్వాత మంగళవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్‌తో బంగ్లాదేశ్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement