ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్ | United World Wrestling clears Narsingh Yadav's participation at Rio 2016 Olympics | Sakshi
Sakshi News home page

ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్

Published Thu, Aug 4 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్

ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో వెళ్లేందుకు మరో కీలక అడ్డంకి తొలగింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) అనుమతి ఇచ్చింది. ‘నాడా’ విచారణలో నిర్దోషిగా తేలిన వెంటనే భారత రెజ్లింగ్ సమాఖ్య యూడబ్ల్యూడబ్ల్యూకు లేఖ రాసింది. ‘ఒలింపిక్స్ సహా ఏ ఇతర అంతర్జాతీయ పోటీల్లోనైనా నర్సింగ్ పాల్గొనవచ్చు.  అతను చాలా ముందుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు’ అని యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకటించింది. మరో వైపు ‘వాడా’నుంచి స్పందన రావాల్సి ఉన్నా... ప్రస్తుతానికి రియో బయల్దేరేందుకు నర్సింగ్ సిద్ధమయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement