కోహ్లీ.. బ్యాట్మన్, ఏబీ.. సూపర్మన్ | Virat-AB are like 'Batman-Superman', says Chris Gayle | Sakshi
Sakshi News home page

కోహ్లీ.. బ్యాట్మన్, ఏబీ.. సూపర్మన్

Published Tue, May 17 2016 12:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 AM

కోహ్లీ.. బ్యాట్మన్, ఏబీ.. సూపర్మన్

కోహ్లీ.. బ్యాట్మన్, ఏబీ.. సూపర్మన్

కోల్కతా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్.. సహచర ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లీర్స్లను ఫిక్సనల్ సూపర్ హీరోలతో పోలుస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. కోహ్లీని బ్యాట్మన్గా, ఏబీని సూపర్మన్గా పోల్చాడు.

'విరాట్, డివిల్లీర్స్లు బ్యాట్మన్, సూపర్మన్లా ఆడుతున్నారు. వీరిద్దరూ, ముఖ్యంగా కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈ జోడీ ఇదే జోరును కొనసాగించి పరుగుల వర్షం కురిపించాలి. బెంగళూరు జట్టు తరపున వీరిద్దరూ కీలకపాత్ర పోషిస్తున్నారు' అని గేల్ అన్నాడు. సోమవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో విరాట్, డివిల్లీర్స్, గేల్ రాణించారు. ఈ ఐపీఎల్ సీజన్లో మూడు సెంచరీలు చేసి రికార్డు సృష్టించిన విరాట్.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు (752) చేసిన బ్యాట్స్మన్గా మరో రికార్డు నెలకొల్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement