కోహ్లీ ఆనందానికి హద్దులు లేవు!
► మూడో టెస్టులో కోహ్లిసేన గెలుపు
► వెస్టిండీస్ గడ్డపై వరుసగా మూడో సిరీస్ కైవసం
గ్రాస్ ఐలెట్: వెస్టిండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. గతంలో 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడికిది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ లపై వరుసగా సిరీస్ లు నెగ్గి హాట్రిక్ విజయాలను అందించిన కెప్టెన్ గా నిలిచాడు.
తన సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. జట్టు చాలా అద్బుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకుందన్నాడు. అంతకుముందు స్యామీ స్టేడియంలో ముగిసిన మూడో టెస్టులో 237 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని సాధించింది.
That's how we roll. So proud of this group. Great Team Effort. Proud to be a part of this team India. Grateful