బోర్డు అడిగితేనే స్పందిస్తాం
నూతన కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో బీసీసీఐకి వ్యక్తిగతంగా తాను ఎవరి పేరునూ సూచించనని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అయితే వారు తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని అన్నాడు.
ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు. కోచ్ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా విండీస్‌తో వన్డే సిరీస్‌పైనే ఉందని కోహ్లి స్పష్టం చేశాడు.