Coach Selection
-
బ్యాటింగ్ కోచ్ ఎవరో?
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి పేరు ఖరారైన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఇతర సహాయక సిబ్బందిపై పడింది. టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లను ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది. సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బృం దం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. సోమవారం ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, గురువారం వరకు కొనసాగే అవకాశం ఉంది. అదే రోజు సాయంత్రం ఎంపికైనవారి జాబితాను ప్రకటిస్తారు. ఈ ఎంపిక విషయంలో రవిశాస్త్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారా లేక ఎంపిక కమిటీ తమదైన శైలిలో తగిన వ్యక్తులను ఎంపిక చేస్తుందా అనేది ఆసక్తికరం. ముందంజలో విక్రమ్ రాథోడ్ ... 2014 నుంచి భారత బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్ పనితీరు నిజానికి బాగుంది. చాలా మంది బ్యాట్స్‌మెన్ అతని హయాంలో తమ ఆటతీరు మెరుగైందని, సాంకేతిక విషయాల్లో కూడా లోపాలు తీర్చిదిద్దారని బహిరంగంగానే చెప్పారు. అయినా సరే బంగర్ పదవి భద్రంగా లేదు. అనేక మంది దీని కోసం పోటీ పడుతున్నారు. కారణాలేమైనా రవిశాస్త్రి కూడా భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ల గురించి మాట్లాడినంత సానుకూలంగా బంగర్ గురించి చెప్పలేదు. దాంతో కొత్త వ్యక్తికి అవకాశం దక్కవచ్చని వినిపిస్తోంది. హెడ్ కోచ్ పదవికి ప్రయత్నించి విఫలమైన లాల్‌చంద్ రాజ్‌పుత్ ఈసారి బ్యాటింగ్ కోచ్ కోసం తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ వైపు ఎక్కువగా మొగ్గు కనిపిస్తోంది. వీరిద్దరితో పాటు ప్రవీణ్ ఆమ్రే, అమోల్ మజుందార్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. సౌరాష్ట్ర కోచ్ సితాన్షు కొటక్, హృషికేశ్ కనిత్కర్, మిథున్ మన్హాస్ కూడా ఇంటర్వ్యూకు హాజరు కానున్నారు. రోడ్స్‌కు కష్టమే! బౌలింగ్ కోచ్ పదవి కోసం ప్రస్తుత కోచ్ భరత్ అరుణ్‌తో పాటు వెంకటేశ్ ప్రసాద్, పారస్ మాంబ్రే, అమిత్ భండారి బరిలో ఉన్నారు. వీరంతా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మరోవైపు జాంటీ రోడ్స్‌లాంటి దిగ్గజం పోటీలో నిలిచినా ప్రస్తుత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని తెలుస్తోంది. ఇన్నేళ్లుగా భారత్ ఫీల్డింగ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దిన శ్రీధర్‌కు రవిశాస్త్రి అండదండలు ఉండటమే దీనికి కారణం. టీమిండియా ప్రస్తుత ప్రమాణాలు శ్రీధర్ ఘనతే కాబట్టి రోడ్స్ స్థాయి వ్యక్తి అయినా సరే అనవసరమనే భావన కనిపిస్తోంది. -
శాస్త్రికి మరో అవకాశం!
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా! ప్రస్తుత కోచ్ రవిశాస్త్రినే కొనసాగుతారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇతర ఐదుగురు అభ్యర్థులు సీఏసీని మెప్పించేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. భారత కోచ్ పదవి కోసం నేడు (శుక్రవారం) ఇంటర్వ్యూలు జరగనున్నాయి. రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, మైక్ హెసన్, లాల్‌చంద్ రాజ్‌పుత్, రాబిన్ సింగ్, ఫిల్ సిమన్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కపిల్ దేవ్‌తో పాటు కమిటీలోని ఇతర సభ్యులు అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగస్వామి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. కెప్టెన్ కోహ్లి మద్దతుతో పాటు చెప్పుకోదగ్గ రికార్డు ఉండటం శాస్త్రికి అనుకూలంగా మారింది. అతని శిక్షణలోనే భారత జట్టు తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. శాస్త్రి కోచ్‌గా వచ్చిన సమయం (జులై 2017)నుంచి భారత్ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది. రెండు వన్డే వరల్డ్ కప్‌లలోనూ సెమీఫైనల్ దాటకపోయినా దానిని పెద్ద వైఫల్యంగా ఎవరూ చూ డటం లేదు. పైగా ఆటగాళ్లందరితో ఈ భారత మాజీ క్రికెటర్‌కు మంచి సంబంధాలు ఉండటం సానుకూలాంశం. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌వంటి సహాయక సిబ్బందిని ఎంపిక చేసేందుకు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. -
కోహ్లి తన అభిప్రాయం చెప్పవచ్చు కానీ...
న్యూఢిల్లీ: ఓవైపు టీమిండియా ప్రధాన కోచ్ ఎంపిక ప్రక్రియ సాగుతుండగా... ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రిని కొనసాగిస్తే బాగుంటుందంటూ కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందనలు కొనసాగుతున్నాయి. కోచ్ ఎంపిక కమిటీ బాధ్యతను చూస్తున్న క్రికెట్ సలహా మండలి (సీఏసీ) సభ్యులు, దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్‌దేవ్, శాంత రంగస్వామి దీనిపై గురువారం వేర్వేరు చోట్ల మాట్లాడారు. తమ కర్తవ్యాన్ని శక్తిమేర నిర్వర్తిస్తా మని పేర్కొన్న కపిల్... కోహ్లి వ్యాఖ్యలపై మాట్లాడుతూ ‘అది అతడి అభిప్రాయం. మేం ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని గౌరవించాలి’ అని స్పష్టం చేశారు. కెప్టెన్‌గా అభిప్రాయం చెప్పే హక్కు కోహ్లికి ఉందంటూనే, తమ కమిటీ సమష్టి నిర్ణయంతో కోచ్‌ను ఎంపిక చేస్తుందని శాంత రంగస్వామి అన్నారు. అనుభవం, సామర్థ్యం, వ్యూహ నైపుణ్యాలను తాము ప్రాతిపదికగా తీసుకుంటామని చెప్పారు. మరోవైపు కోహ్లి వ్యాఖ్యలు కోచ్ ఎంపికపై ప్రభావం చూపవని, ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్య్రాన్ని ఎవరూ అడ్డుకోలేరని క్రికెట్ పాలకుల మండలి (సీవోఏ) సభ్యుడొకరు వ్యాఖ్యానించారు. కోహ్లి కెప్టెనే అయినా, ఎంపికకు ఒక కమిటీని నియమించిన విషయాన్ని గుర్తుచేశారు. -
సశేషం!
♦ భారత కోచ్ పేరును ప్రకటించని బీసీసీఐ ♦ ఇంటర్వ్యూలు నిర్వహించిన సీఏసీ ♦ కోచ్ లేకుండానే లంక టూర్‌కు! భారత క్రికెట్‌కు సంబంధించిన ఒక కీలక అంకం ముగిసింది. కొత్త కోచ్ ఎంపిక కోసం జరిగిన ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజరు కాగా, వారిలో ఎవరికి పదవీ యోగం దక్కుతుందో తేలేందుకు మరికొంత సమయం పట్టనుంది. క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) ఈ విషయంలో ఎలాంటి తొందరపాటును ప్రదర్శించడం లేదు. అనిల్ కుంబ్లేతో సాగిన వివాదం నేపథ్యంలో కోహ్లితో కూడా ‘ఒక మాట’ మాట్లాడిన తర్వాతే కోచ్ పేరును ప్రకటించవచ్చు. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనకు కూడా కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లే అవకాశం ఉంది. ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఐదుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) తుది నిర్ణయం తీసుకోలేకపోయింది. ప్రస్తుతానికి తాము కోచ్ పేరును ప్రకటించడం లేదని, దీనిపై మరింత చర్చ జరగాల్సి ఉందని సీఏసీ సభ్యుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. సోమవారం గంగూలీతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్ (లండన్ నుంచి స్కైప్ ద్వారా) ఇంటర్వ్యూలు నిర్వహించారు. ‘కోచ్ పేరును ఇప్పుడే ప్రకటించడం లేదు. కొన్ని రోజుల సమయం ఇంకా అవసరం ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాం. ఎంపికకు తొందరేమీ లేదని మా అభిప్రాయం. ఈసారి ఎవరి పేరును ప్రకటించినా వారు 2019 వరల్డ్ కప్ వరకు కొనసాగుతారు’ అని గంగూలీ స్పష్టం చేశారు. అంతా అప్పటిలాగే... సీఏసీ నిర్వహించిన ఇంటర్వ్యూలకు ఐదుగురు అభ్యర్థులు హాజరయ్యారు. రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, లాల్‌చంద్ రాజ్‌పుత్ (భారత్), టామ్ మూడీ (ఆస్ట్రేలియా), రిచర్డ్ పైబస్ (దక్షిణాఫ్రికా)లు తమ శిక్షణ, ప్రణాళికల గురించి వివరించారు. మరో అభ్యర్థి ఫిల్ సిమన్స్ (విండీస్) మాత్రం ఇంటర్వ్యూకు రాలేదు. సెహ్వాగ్ ఇంటర్వ్యూ రెండు గంటలకు పైగా సాగింది. అభ్యర్థుల ప్రజెంటేషన్ విషయంలో అంతా గత ఏడాది తరహాలోనే సాగిందని గంగూలీ చెప్పారు. ‘భారత క్రికెట్ భవిష్యత్తు గురించి అభ్యర్థులు చెప్పిన విషయాలు, ఆలోచనలు గతంలో చూసినవే. నేను గానీ బోర్డు కార్యదర్శి లేదా సీఈఓ గానీ మ్యాచ్ బరిలోకి దిగేవాళ్లం కాదు. అందరికంటే ఆటగాళ్లు ముఖ్యం. వారికి సహాయక సిబ్బంది అండగా ఉంటారు. అయితే అందరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటే బాగుంటుంది. భారత క్రికెట్ మేలు గురించి ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని ఈ మాజీ కెప్టెన్ అన్నారు. కోహ్లితో చర్చించిన తర్వాతే... కోచ్ పేరును ప్రకటించే ముందు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లితో కచ్చితంగా చర్చిస్తామని గంగూలీ వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు మాత్రం కోహ్లి తమ పనిలో కలగజేసుకోలేదని, కోచ్‌గా ఎవరు ఉండాలనే పేరును కూడా సూచించలేదని ఆయన అన్నారు. ‘కోచ్ ఎవరితో కలిసి పని చేయాల్సి ఉంటుందో అలాంటి వారితో మాట్లాడటం కూడా చాలా అవసరం. అతను 2019 ప్రపంచ కప్ వరకు ఉండాల్సి ఉంటుంది. ఆరు నెలల తర్వాత అభిప్రాయ భేదాలు రాకూడదు కదా. ఎంపికతో మా పాత్ర ముగిసిపోతుంది కానీ జట్టును ముందుకు నడిపించాల్సింది కెప్టెన్, కోచ్, ఆటగాళ్లు మాత్రమే’ అని ‘దాదా’ చెప్పారు. అలాగే ‘కోచ్‌లు ఎలా పని చేస్తారో కూడా కోహ్లి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది’ అంటూ పరోక్షంగా చురక కూడా అంటించారు. కోహ్లి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. అతను ఈ నెల 17న భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉంది. శాస్త్రికి కష్టమేనా? ఇంటర్వ్యూకు ముందు వరకు కూడా రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికవుతారని అందరూ భావిస్తూ వచ్చారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం ఇంటర్వ్యూలు ముగిశాక రవిశాస్త్రికి మరీ అనుకూల వాతావరణం ఏమీ లేదు. అసలు కోచ్ పేరును నేరుగా ప్రకటించకుండా కోహ్లిని భాగస్వామిగా చేయడంలోనే సీఏసీ చాలా తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా తమ నిర్ణయం కాదని, రేపు కుంబ్లే తరహాలో ఏదైనా జరిగితే కోహ్లిదే బాధ్యత అని కమిటీ చెప్పకనే చెప్పింది. బీసీసీఐలోని ఒక వర్గం చెబుతున్న ప్రకారం... కోహ్లి ముందు సీఏసీ రెండు ప్రత్యామ్నాయాలు ఉంచి అందులో ఒకరిని ఎంపిక చేసుకోమని కోరుతున్నట్లు సమాచారం. అయితే అందులో శాస్త్రి పేరు కాకుండా సెహ్వాగ్, టామ్ మూడీ పేర్లు ఉన్నాయని వారు అంటున్నారు! -
బోర్డు అడిగితేనే స్పందిస్తాం
నూతన కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో బీసీసీఐకి వ్యక్తిగతంగా తాను ఎవరి పేరునూ సూచించనని కెప్టెన్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. అయితే వారు తమను సంప్రదిస్తే మాత్రం జట్టు తరఫున సభ్యులంతా అభిప్రాయం చెబుతామని అన్నాడు. ఈ విషయంలో తమందరిదీ ఒకే మాట ఉంటుందని కోహ్లి చెప్పాడు. కోచ్ ఎంపికపై బహిరంగ చర్చ అనవసరమని అతను వ్యాఖ్యానించాడు. ప్రస్తుతానికైతే తమ దృష్టంతా విండీస్‌తో వన్డే సిరీస్‌పైనే ఉందని కోహ్లి స్పష్టం చేశాడు. -
భారత క్రికెట్లో ‘సూపర్ స్టార్’ సంస్కృతి
► వాళ్లు ఏం చేసినా చెల్లుతోంది ► కోచ్ ఎంపికతో కోహ్లికి ఏం పని? ► ధోని, గంగూలీ, ద్రవిడ్లదీ తప్పే ► రామచంద్ర గుహ తీవ్ర వ్యాఖ్యలు క్రికెట్ చరిత్రకారుడు బీసీసీఐ చరిత్రను తవ్వే పనిలో పడ్డారు. పదవి నుంచి తప్పుకుంటూ భారత దిగ్గజాల వ్యవహార శైలిని ఘాటుగా ప్రశ్నిస్తూ పోయారు. కోర్టు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడంలో సీఓఏ వైఫల్యాన్ని కూడా గుర్తు చేశారు. పరిపాలకుల కమిటీ నుంచి తప్పుకుంటూ తన రాజీనామా లేఖలో అనేక అంశాలను రామచంద్ర గుహ ప్రస్తావించారు. ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... గుహ లేవనెత్తిన అంశాలు భారత క్రికెట్లో మళ్లీ చర్చకు దారి తీయడం ఖాయం. న్యూఢిల్లీ: ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ భారత క్రికెట్ పని తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పరిపాలకుల కమిటీ (సీఓఏ) నలుగురు సభ్యులలో ఒకరిగా ఉన్న గుహ, వ్యక్తిగత కారణాల పేరుతో గురువారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తన రాజీనామా సమయంలో కమిటీ చైర్మన్ వినోద్ రాయ్‌కు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. తాను సభ్యుడిగా ఉన్న గత నాలుగు నెలల కాలంలో తాను పరిశీలించిన అంశాలను ఆయన రాయ్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ లేఖలో ఆయన ప్రశ్నించిన కొన్ని ప్రధాన అంశాలను సంక్షిప్తంగా చూస్తే... కోచ్‌ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ భారత జట్టుకు కోచ్‌లుగా పని చేసేవారు ఐపీఎల్ జట్లకూ కోచ్‌గా వ్యవహరించడం సరికాదు. అవసరమైతే వారికి కొంత అదనపు మొత్తం చెల్లించవచ్చు. రాహుల్ ద్రవిడ్, ఆర్.శ్రీధర్, సంజయ్ బంగర్, భరత్ అరుణ్‌లకు ఈ విషయంలో బోర్డు అపరిమిత స్వేచ్ఛ ఇచ్చింది. పది నెలల కాంట్రాక్ట్ మాత్రమే ఇస్తూ వారు ఐపీఎల్లో పని చేసే విధంగా సడలింపు ఇస్తున్నారు. ఇదంతా అనైతిక వ్యవహారం. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో జూనియర్ క్రికెటర్ల క్యాంప్ ఉంటే ఒక కోచ్ ఐపీఎల్ ఉందని వెళ్లిపోయారు. సీఓఏ సమావేశాల్లో పలు మార్లు ఈ అంశాన్ని నేను ప్రస్తావించినా పట్టించుకోలేదు. కామెంటేటర్ల కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ సునీల్ గావస్కర్ పీఎంజీ అనే ప్లేయర్ మేనేజ్మెంట్ కంపెనీకి యజమా ని. అది శిఖర్ ధావన్, రిషభ్ పంత్ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. అదే గావస్కర్ బీసీసీఐ కామెంటరీ టీమ్‌లో సభ్యుడిగా వారి గురించి వ్యాఖ్యానిస్తారు. ఇది పూర్తిగా తప్పు. ఆయన రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కావాలి. ఒక ప్రఖ్యాత క్రికెటర్ (సౌరవ్ గంగూలీ) ఒక క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూ మళ్లీ కామెంటరీ కూడా చేస్తే ఎలా? దేశవాళీలో తక్కువ చెల్లింపులు ఒక రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడితే ఆటగాడికి రూ.1.14 లక్షలు లభిస్తాయి. అయితే పది వేలు మాత్రమే ముందుగా ఇస్తారు. మిగతావన్నీ వాయిదాల్లోనే. ఐపీఎల్ లేకుండా దీనిపైనే బతికే ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీనిని ఒక క్రమపద్ధతిలో ఉంచాలి. కొన్నిసార్లు రాష్ట్ర సంఘాలు ఆటగాళ్లకు పూర్తి మొత్తాలు కూడా ఇవ్వడం లేదు. సీఓఏ సరిగా పని చేయలేదు కొన్ని అంశాల్లో మా సీఓఏ కూడా చురుగ్గా వ్యవహరించలేదు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అనర్హులైన అనేక మంది బోర్డు, రాష్ట్ర సంఘాల ఆఫీస్ బేరర్లు స్వేచ్ఛగా సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో కొందరు అతిగా చొరవ చూపించి చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాలని ప్రచారం చేశారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చాయి కూడా. అయితే ఈ విషయాన్ని సీఓఏ కోర్టు దృష్టికి తీసుకుపోలేదు. నాకు కనీస సమాచారం లేకుండా సీఓఏ తమ లాయర్‌ను మార్చేసింది కూడా. క్రికెటర్ ఉండాలి: సీఓఏలో ఒక పురుష క్రికెటర్ లేకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు వచ్చాయి. బిషన్‌సింగ్ బేడీ, వెంకట్రాఘవన్ పేర్లు నేను చెప్పినా 70 ఏళ్లు దాటాయని చెప్పి తీసుకోలేదు. నేను జవగళ్ శ్రీనాథ్ పేరు చెప్పాను. నా స్థానంలో కమిటీలో క్రికెటర్ వస్తాడని ఆశిస్తున్నా. నాకేమీ తెలీదు.. శ్రీనాథ్: మరోవైపు సీఓఏలో తాను సభ్యుడైతే బాగుంటుందంటూ గుహ చేసిన సూచనపై జవగళ్ శ్రీనాథ్ మాట్లాడుతూ... ‘ఆ ప్రతిపాదన గురించి నాకేమీ తెలీదు. దానికి సంబంధించి నా మనసులో ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తా’ అని అన్నారు. కుంబ్లే, కోహ్లి వివాదం గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదన్న శ్రీనాథ్, భారత్ చాంపియన్స్ ట్రోఫీ గెలవడమే అన్నింటికంటే ముఖ్యమన్నారు. ధోనికి కాంట్రాక్ట్ భారత క్రికెట్లో ఉన్న సూపర్ స్టార్ సంస్కృతి ధోనికి వరంలా మారింది. తాను టెస్టులు ఆడలేనంటూ స్వయంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతనికి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వడంలో అర్థం లేదు. ఇది తప్పుడు సంకేతాలు పంపిస్తుంది. దీనిని కూడా నేను విరోధించాను. సూపర్ స్టార్ కెప్టెన్ కోచ్‌పై తమకు ప్రత్యేక అధికారం ఉందని సీనియర్ ఆటగాళ్లు భావిస్తున్నారు. ప్రొఫెషనల్ క్రీడల్లో ప్రపంచంలో ఏ దేశంలో, ఏ క్రీడలో కూడా ఇలాంటిది జరగదు. సూపర్ స్టార్ సంస్కృతి ఇప్పటికే అదుపు తప్పిపోయింది.ఎక్కడా లేని విధంగా కోచ్‌లు, కామెంటేటర్ల ఎంపిక విషయంలో ఆటగాళ్లు జోక్యం చేసుకోవడం ఏమిటి ? (కోహ్లిపై వ్యాఖ్యలతోనే గతంలో హర్షా భోగ్లేపై వేటు పడింది). రేపు సెలక్టర్లు, ఆఫీస్ బేరర్లను కూడా వారే ఎంపిక చేస్తారేమో? కెప్టెన్, కోచ్ మధ్య విభేదాలు ఉన్నాయని భావిస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ ముగిసిన వెంటనే కొత్త కోచ్ గురించి చర్చించాల్సింది. ఇప్పుడు ప్రధాన టోర్నీకి ముందు ఆ అంశాన్ని తీసుకొస్తారా? కుంబ్లే వ్యవహారంలో బోర్డు చాలా నిర్దాక్షిణ్యంగా, ప్రొఫెషనలిజానికి విరుద్ధంగా వ్యవహరించింది. దురదృష్టవశాత్తూ సీఓఏ కూడా ఈ సమయంలో చురుగ్గా పని చేయడంలో విఫలమైంది. -
కుంబ్లేనే కోచ్?
ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులు కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా బోర్డు అడ్వైజరీ కమిటీ సభ్యులు సచిన్, గంగూలీ, లక్ష్మణ్ మంగళవారం ఏడుగురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరిలో అనిల్ కుంబ్లే, ప్రవీణ్ ఆమ్రే, లాల్‌చంద్ రాజ్‌పుత్ నేరుగా కమిటీ ముందు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. మాజీ డెరైక్టర్ రవిశాస్త్రితో పాటు విదేశీయులు టామ్ మూడీ, స్టువర్ట్‌లా, ఆండీ మోల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ ప్రజెంటేషన్‌ను అందించారు. కమిటీ తన నివేదికను బుధవారం బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కేకు సమర్పించే అవకాశం ఉంది. 24న జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో అధికారికంగా కోచ్ పేరును ప్రకటిస్తారు. అయితే అనిల్ కుంబ్లేనే కోచ్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని బోర్డు వర్గాల సమాచారం. సచిన్, గంగూలీ, లక్ష్మణ్ త్రయం రవిశాస్త్రికంటే తమ మాజీ సహచరుడి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కోచ్ ఎంపిక ప్రక్రియ ముగిసిందని, ఇకపై ఎవరినీ ఇంటర్వ్యూకు పిలవడం లేదని గంగూలీ ప్రకటించారు. అనూహ్యంగా భారత మాజీ ఆటగాడు, ప్రస్తుత సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్‌కు మాత్రం పిలుపు రాలేదు. -
భారత జట్టు కోచ్ రేసులోకి కుంబ్లే
దరఖాస్తు చేసిన దిగ్గజ స్పిన్నర్ ముంబై: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపిక వ్యవహారం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవలి వరకు డెరైక్టర్‌గా చక్కటి విజయాలు అందించిన రవిశాస్త్రితో పాటు గతంలో కోచ్‌గా పని చేసిన సందీప్ పాటిల్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తుండగా... ఇప్పుడు దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కూడా అనూహ్యంగా ఈ రేసులోకి దూసుకొచ్చాడు. బీసీసీఐకి దరఖాస్తు చేసిన 57 మందిలో కుంబ్లే పేరు కూడా ఉన్నట్లు తెలిసింది. కుంబ్లే ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. 18 ఏళ్ల కెరీర్ తర్వాత 2008లో రిటైర్ అయిన కుంబ్లే 132 టెస్టుల్లో 619 వికెట్లు, 271 వన్డేల్లో 337 వికెట్లతో భారత అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా నిలిచాడు. ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఆటగాడిగా, మెంటార్‌గా పని చేసిన అనంతరం ముంబై ఇండియన్స్‌కు కూడా మెంటార్‌గా పని చేశాడు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ చైర్మన్‌గా, కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన కుంబ్లే ఇప్పుడు జాతీయ జట్టుతో నేరుగా కలిసి పని చేయాలని ఉత్సాహంగా ఉన్నాడు. అధికారికంగా కోచ్‌గా ఎలాంటి అనుభవం లేకపోయినా కెరీర్ రికార్డే కుంబ్లే అతి పెద్ద బలంగా భావించవచ్చు. ధోని, కోహ్లిలతో కలిసి ఆడిన అనుభవం కూడా అతనికి కోచ్ ఎంపిక విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది.