టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పెళ్లి సోమవారం ఇటలీలోని టస్కలీలో వైభవంగా జరిగింది. ఈ వివాహనికి అత్యంత సన్నిహితులు మాత్రమే హజరయ్యారు. వీరుష్కల పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషలమీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వీరికి సంబంధించిన ఇంకో వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. మైదానంలో తన బ్యాట్‌తో అందిర్నీ అలరించే కోహ్లి తాజాగా తన స్వరంతో అకట్టుకున్నాడు.
వివాహం అనంతంరం రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కోహ్లి బార్యామణి కోసం ‘ మేరే మెహబూబ్.. కాయత్ హోగి’..(మిస్టర్ ఎక్స్ ఇన్ బాంబే సినిమాలోని)అనే పాటను పాడాడు. అతని స్వరం విన్నవారు చపట్లు కొడుతూ.. ప్రశంసలతో ముంచెత్తారు. అత్యంత సన్నిహితుల మధ్య సోమవారం ఇంటలీలోని టస్కలీలో విరుష్క జంట ఒక్కటైంది. ప్రపంచంలోనే అత్యంత ఖర్చైన హాలిడే స్పాట్‌లో వీరి పెళ్లి జరిగింది. ఇటలీలోని టస్కనీ ప్రాంతంలో కేవలం వంద మంది జనాభే నివసించే అతి చిన్న గ్రామమైన బిబియానోలో ఉన్న బోర్గో ఫినాచెజియో విల్లాలో ఈ వివాహ వేడుక జరిగింది.
ఆహ్వానం అందిన వారిని మాత్రమే విల్లాలోకి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత డిసెంబర్ 26న ముంబైలో వైభవంగా రిసెప్షన్ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు బీసీసీఐ పెద్దలతో పాటు క్రికెట్, బాలీవుడ్‌లకు చెందిన అతిరథ మహారథులంతా హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment