కోల్‌కతా: శ్రీలంకతో జరిగిన తొలిటెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. అయితే అందరికీ తెలియని మరో అంశం ఏంటంటే.. వ్యక్తిగత స్కోరు 97 పరుగుల వద్ద ఉన్న సమయంలో ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయాలా? అని ఫీల్డ్ బయట ఉన్న కోచ్ రవిశాస్త్రిని కెప్టెన్ కోహ్లీ అడగటం గమనార్హం. నిన్న (సోమవారం) టెస్ట్ చివరిరోజు కావడంతో తమ బౌలర్లకు ప్రత్యర్థి జట్టు లంక ఆటగాళ్లకు ఔట్ చేసేందుకు సమయం ఉంటుందో లేదోనని కోహ్లీ ఆ నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ ఓ వీడియోను పోస్ట్ చేయగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వాస్తవానికి ఆ సెంచరీ చేస్తే కోహ్లీ ఖాతాలో ఎన్నో అరుదైన రికార్డులు చేరతాయని తెలిసినా.. బౌలర్లకు ఎక్కువ సమయం ఇవ్వాలని భావించాడు. సెంచరీ కోసం మరికొన్ని బంతులు ఆడితే మ్యాచ్ ఫలితం ఆశించినట్లుగా రాదని భావించిన కోహ్లీ, కోచ్ రవిశాస్త్రికి సంకేతాలు పంపగా.. వద్దు మరో ఓవర్ ఆడి సెంచరీ పూర్తిచేసుకో.. అప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయ్ మంటూ రిప్లై వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన కెప్టెన్, రెండో ఇన్నింగ్స్‌లో శతకం (104) బాది అన్నిఫార్మట్లలో కలిపి 50 సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. జట్టు కోసం కోహ్లీ సెంచరీని వదులుకోవడానికి సిద్ధపడ్డాడంటూ క్రికెట్ ప్రేమికుల నుంచి భారీగా కామెంట్లు వస్తున్నాయి.
విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment