ముంబై: సచిన్ టెండూల్కర్ ఆఖరి టెస్టు కోసం తయారు చేసిన పిచ్‌పై టర్న్‌తో పాటు బౌన్స్ కూడా ఉంటుందని క్యూరేటర్ సుధీర్ నాయక్ చెప్పారు. రెండేళ్ల క్రితం భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా టెస్టు మ్యాచ్ జరిగింది. ఈసారి కూడా అప్పటి తరహా వికెట్‌నే తయారు చేశామని ఆయన తెలిపారు. ‘గత ఏడాది ఇంగ్లండ్‌తో మ్యాచ్ తరహాలో పూర్తిగా స్పిన్‌కు అనుకూలంగా ఉండదు. 2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు తయారు చేసిన తరహాలోనే సిద్ధం చేశాం’ అని నాయక్ చెప్పారు. ప్రస్తుతం పిచ్ మీద పచ్చిక ఉన్నా మ్యాచ్ సమయానికి దానిని తొలగిస్తారు. మరోవైపు వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ భుజం గాయం కారణంగా స్వదేశానికి వెళ్లాడు. వన్డే జట్టులో ఉన్న పొలార్డ్ కూడా గాయం కారణంగా భారత్ రావడం లేదు.
మ్యూజియానికి సచిన్ గ్లోవ్స్, జెర్సీ
కోల్‌కతా: కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్న సచిన్ టెండూల్కర్‌కు కోల్‌కతాలో బహుమతుల వర్షం కురిస్తే... క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్)కు మాత్రం మాస్టర్ నుంచి ప్రత్యేకమైన కానుక అందింది. విండీస్‌తో టెస్టు మ్యాచ్ సందర్భంగా తాను ధరించిన గ్లోవ్స్, జెర్సీని వాళ్లకు అందజేశాడు. వీటిని తాము మ్యూజియంలో భద్రపరుస్తామని క్యాబ్ సంయుక్త కార్యదర్శి సుభీర్ గంగూలీ చెప్పారు. ఎయిర్‌షో చేసేందుకు మ్యాచ్ చివరి రెండు రోజులకు మాత్రమే ఏటీసీ అనుమతించిందన్నారు. దీంతో రూ. 1.3 లక్షలు నష్టం వాటిల్లిందన్నారు.
వాంఖడేలో టర్న్, బౌన్స్: క్యూరేటర్
Published Sun, Nov 10 2013 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement