వార్నర్, ఖాజా సెంచరీలు | Warner, Khawaja centuries | Sakshi
Sakshi News home page

వార్నర్, ఖాజా సెంచరీలు

Published Fri, Nov 6 2015 1:03 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

వార్నర్, ఖాజా సెంచరీలు

వార్నర్, ఖాజా సెంచరీలు

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 389/2  న్యూజిలాండ్‌తో తొలి టెస్టు

బ్రిస్బేన్: న్యూజిలాండ్‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. డేవిడ్ వార్నర్ (224 బంతుల్లో 163; 19 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఖాజా (133 బంతుల్లో 102 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 88 ఓవర్లలో 2 వికెట్లకు 389 పరుగులు చేసింది.

ఖాజాతో పాటు స్మిత్ (54 బంతుల్లో 41 బ్యాటింగ్; 7 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. బ్రిస్బేన్ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బర్న్స్ (120 బంతుల్లో 71; 12 ఫోర్లు), వార్నర్‌లు తొలి వికెట్‌కు 161 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement