చెన్నై ఓపెన్‌కు వావ్రింకా | Wawrinka to Chennai Open | Sakshi
Sakshi News home page

చెన్నై ఓపెన్‌కు వావ్రింకా

Published Wed, Sep 23 2015 12:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

చెన్నై ఓపెన్‌కు వావ్రింకా - Sakshi

చెన్నై ఓపెన్‌కు వావ్రింకా

ఎనిమిదోసారి బరిలోకి...

 చెన్నై : డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా ఎనిమిదోసారి చెన్నై ఓపెన్‌లో బరిలో దిగనున్నాడు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 10 వరకు జరిగే ఈ టోర్నీలో అతను పాల్గొంటాడని నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్‌లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన ఈ స్విస్ ప్లేయర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దీంతో ముచ్చటగా మూడోసారి చెన్నై టైటిల్‌పై కన్నేశాడు. చెన్నై ఓపెన్‌తో సీజన్‌ను ప్రారంభించడం అద్భుతంగా ఉటుందని వావ్రింకా అన్నాడు. ‘టోర్నీపై దృష్టిపెట్టా. చివరి రెండేళ్లు చాలా ప్రత్యేకం.

ఎందుకంటే చెన్నై ట్రోఫీతో సీజన్ మొదలుపెట్టాక కచ్చితంగా ఓ గ్రాండ్‌స్లామ్ గెలుస్తున్నా. మూడోసారి కూడా టైటిల్ గెలిచి వచ్చే ఏడాది మరింత ప్రత్యేకంగా నిలుపుకుంటా’ అని వావ్రింకా వ్యాఖ్యానించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement