‘వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరతాం’ | We Can Reach World Cup Semifinals, Mohammad Shahzad | Sakshi
Sakshi News home page

‘వరల్డ్‌కప్‌లో సెమీస్‌కు చేరతాం’

Published Tue, Dec 4 2018 1:34 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

We Can Reach World Cup Semifinals, Mohammad Shahzad - Sakshi

హెరాత్‌: వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో్ సెమీ ఫైనల్‌ చేరే సత్తా తమ జట్టుకు ఉందని అఫ్ఘానిస్తాన్ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ షెహజాద్‌ ధీమా వ్యక్తం చేశాడు. తమదైన రోజున ఎంతటి జట్టునైనా ఓడిస్తామన్న షెహజాద్‌.. తమ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు. ‘మా జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. దవ్లాత్‌ జద్రాన్‌, అప్తాబ్‌ అలామ్‌లు మా పేస్‌ బౌలింగ్‌ బలం. బ్యాటింగ్‌లో సముచిత స్కోరు ఆటగాళ్లున్నారు.

ఇక మా స్పిన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక‍్కర్లేదు.. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతో వచ్చే మెగా టోర్నీలో సెమీ ఫైనల్‌ చేరతామనే నమ్మకం నాకుంది. నా వరకూ అయితే సహజసిద్ధమైన ఆటనే ఆడతా. ప్రధానంగా బంతి లెంగ్త్‌ను చూసే బ్యాటింగ్‌ చేస్తా. నా జోన్‌లో ఉన్న బంతిని ఎటువంటి కనికరం లేకుండా హిట్‌ చేయడమే నాకు తెలుసు. క్రికెట్‌లో ఎక్కువ అవకాశాలనేవి ఉండవు. మనకు వచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడమే మనం చేయాల్సింది. దాన్ని ఎంజాయ్‌ చేస్తూ నా ఆటను కొనసాగిస్తున్నా’ అని షెహజాద్‌ తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement