మా అంపైర్లను పంపించం | We do not send our umpires | Sakshi
Sakshi News home page

మా అంపైర్లను పంపించం

Published Mon, May 18 2015 6:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

We do not send our umpires

పాక్, జింబాబ్వే సిరీస్‌పై ఐసీసీ
 
దుబాయ్ : పాకిస్తాన్, జింబాబ్వే సిరీస్‌కు తమ అంపైర్లను, రిఫరీలను పంపించడం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించింది. తమ సెక్యూరిటీ కన్సల్టెంట్ నివేదికను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. 2009లో శ్రీలంక జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో అక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. ఆ తర్వాత  పాక్‌లో ఓ జట్టు పర్యటించనుండటం ఇదే తొలిసారి.

ఇక తాజా ఐసీసీ నిర్ణయంతో పాక్ క్రికెట్ బోర్డు తమ దేశవాళీ అంపైర్లను ఈ సిరీస్ కోసం ఉపయోగించుకోనుంది. మూడు వన్డేలు, రెండు టి20ల కోసం రేపు (మంగళవారం) జింబాబ్వే జట్టు పాక్‌కు రానుంది. 22న తొలి టి20 జరుగుతుంది. మరోవైపు ఈ సిరీస్ కోసం పాక్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. టిక్కెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయని పీసీబీ సంతోషం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement