న్యూఢిల్లీ: జూలైలో వెస్టిండీస్, భారత్‌ల మధ్య జరిగే టెస్టు సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. 49 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ రెండు వార్మప్ మ్యాచ్‌లతో పాటు 4 టెస్టులను ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి టీమిండియా జూలై 6న వెస్టిండీస్ బయల్దేరుతుంది.
రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల తర్వాత జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగుతాయి. మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్ లూసియాలో, నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్‌లో జరుగుతాయి.