పెద్ద గ్రౌండ్‌లు అయితే.. ఫోర్లు, సిక్సర్లు బాదేస్తా
న్యూఢిల్లీ: సాధారణంగా చిన్న గ్రౌండ్‌లలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే భారీ స్కోర్లు నమోదు అవుతాయి. ఇక టి-20 ఫార్మాట్ అయితే బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌కు మాత్రం చిన్న మైదానాల్లో మ్యాచ్‌లు ఆడటం ఇబ్బందికరంగా ఉంటుందట. పెద్ద గ్రౌండ్‌లలో అయితే బంతి బౌండరీ లైన్ దాటాలంటే ఎలా కొట్టాలో తనకు తెలుసునని యూసుఫ్ అన్నాడు.
టి-20 క్రికెట్లో తన పాత్రను కొద్దిగా మారిందని చెప్పాడు. ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు సులభంగా ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నారని, అవసరమైతే తాను సహజశైలిలో దూకుడుగా ఆడగలనని, అలాగే 20 ఓవర్లూ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా సిద్ధపడతానని యూసుఫ్ అన్నాడు. 2007 జరిగిన తొలి టి-20 ప్రపంచ్ కప్‌లో యూసుఫ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో వెలుగులోకి వచ్చాడు. 2010 సీజన్‌లో రాజస్థాన్ తరపున ఆడిన యూసుఫ్ 37 బంతుల్లో మెరుపు సెంచరీ చేశాడు. ప్రస్తుతం కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు.