
హర్మన్‌ప్రీత్‌కు ఓఎస్‌డీగా పదోన్నతి
ముంబై: భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు రైల్వే సంస్థలో పదోన్నతి లభించింది. ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో పంజాబ్‌కు చెందిన ఈ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో అసాధారణ బ్యాటింగ్‌తో హర్మన్ (115 బంతుల్లో 171 నాటౌట్) భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన సంగతి తెలిసిందే. ఆమె ఆటతీరుకు ప్రోత్సాహకంగా రైల్వే శాఖ వెస్టర్న్ రైల్వే పరిధిలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పదోన్నతి కల్పించింది. ముంబైలో ఆమె 2014 నుంచి చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తోంది.