దానికి చాలా టైముంది: ధోని
ధర్మశాల: వచ్చే ట్వంటీ 20 వరల్డ్ కప్ నాటికి పలురకాల బ్యాటింగ్ కాంబినేషన్లను పరీక్షించాల్సిన అవసరముందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. అయితే ట్వంటీ 20 వరల్డ్ కప్ కు చాలా సమయం ఉన్నందున ఇప్పుడే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. బ్యాటింగ్ లో తొలి ఆరుగురు ఆటగాళ్లు ఫామ్ లో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నాడు.
ఆటగాళ్లలో 'దూకుడు' ఉండాలని ఒప్పుకున్న ధోని.. అది నిబంధనలకు లోబడే ఉంటే బాగుంటుందన్నాడు. ప్రస్తుతం తమ జట్టులోని యువ ఆటగాళ్లు ఎంతో పరిణితి కనబరుస్తున్నారని ధోని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో శుక్రవారం నుంచి ఆరంభం కానున్న ట్వంటీ 20 సిరీస్ కు తాము పూర్తి సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తాము ప్రాక్టీస్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ధోని పేర్కొన్నాడు. ప్రధానం పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ,శ్రీనాథ్ అరవింద్ లు ఉండగా, స్పిన్ విభాగంలో హర్భజన్ సింగ్, అమిత్ శర్మ, అక్షర్ పటేల్ లు సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారన్నాడు.