సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా బుధవారం దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేతి వేలికి గాయమైంది. దాంతో టీమిండియా యాజమాన్యం ఆందోళనలో పడింది. శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గాయంతో కోహ్లి విలవిల్లాడగా, వెంటనే టీమిండియా ఫిజియో పాట్రిక్.. అతని బొటన వేలిపై స్ప్రే చేసి ప్రథమ చికిత్స చేశాడు.
కోహ్లికి గాయం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అయిందా.. లేదా ఫీల్డింగ్‌లోనా అనే విషయంపై స్పష్టత లేదు. మరొకవైపు కోహ్లి గాయం వార్త భారత అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ గాయంపై బీసీసీఐ కానీ, జట్టు యాజమాన్యం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయ లేదు. అయితే గాయం నుంచి కోలుకోవడానికి కోహ్లికి తగినంత సమయం ఉందని పలువురు అంటున్నారు.ఈ మెగాటోర్నీలో భాగంగా భారత జట్టు ఈ నెల 5న తొలి మ్యాచ్ ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment