టీంఇండియా పై ప్రతికారం తీర్చుకోండి..
టీంఇండియా పై ప్రతికారం తీర్చుకోండి..
Published Fri, Jun 16 2017 10:09 PM | Last Updated on Sat, Mar 23 2019 8:04 PM
కరాచీ: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ను ఓడించి ప్రతికారం తీర్చుకోవాలని పాక్ జట్టును ఆ దేశ మాజీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ కోరాడు. టోర్నీ తొలి మ్యాచ్‌లో పాక్‌పై భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పాక్ వరుసగా దక్షిణాఫ్రికా, శ్రీలంకలపై గెలిచి సెమీస్‌లో ఇంగ్లండ్ పై సంచలన విజయంతో ఫైనల్‌కు చేరింది. అయితే ఈ సారి పాక్ భారత్ ఓడించి ప్రతీకారం తీర్చుకుంటుందని జహీర్ అబ్బాస్ డాన్ పత్రికతో అన్నాడు.
ఓటమితో పుంజుకున్న పాక్ ఆటగాళ్లు టైటిల్ సాధించి ఐసీసీ టోర్నమెంట్లోని భారత్‌పై ఉన్న పాక్ చెత్త రికార్డును తుడిపెస్తారని ఈ మాజీ ఆటాగాడు ఆశాభావం వ్యక్తం చేశాడు. బలమైన ఇంగ్లండ్‌ను ఓడించిన పాకిస్థాన్ ఫైనల్లో దేశం కోసం ఎదో ఒకటి చేస్తుందని తెలిపాడు. ఇంగ్లండ్‌పై పాక్ ఆటగాళ్లు సమిష్టిగా రాణించి విజయం సాధించారని, ఇదే ఊపును ఫైనల్ మ్యాచ్‌లో కొనసాగించాలని అబ్బాస్ ఆకాంక్షించాడు. ఇప్పుడు పాకిస్థాన్ సమయం అని తొలి మ్యాచ్‌లో పాక్ ఓడినట్లే భారత్ ఓడుతుందని, చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పాక్‌దేనని అబ్బాస్ జోస్యం చెప్పాడు. ఐసీసీ టోర్నీల్లో ఇరు జట్లు 15 సార్లు తలపడగా భారత్‌ను 13 సార్లు విజయం వరించగా కేవలం రెండుసార్లు మాత్రమే పాక్ గెలిచింది.
Advertisement