బళ్లారి అర్బన్ : నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని అశ్రద్ధ చేయకుండా దైవంతో సమానంగా పూజించాలని విజయవాడకు చెందిన విమలానంద ఆధ్యాత్మిక పరిశోధన సంస్థ వ్యవస్థాపకుడు నందిగామ హరేరామ శర్మ పేర్కొన్నారు. నగరంలోని బాలాంజనేయ దేవస్థానంలో నందిగామ హరేరామ శర్మ ఆధ్వర్యంలో జరుగుతున్న లలితా వైభవ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం రాత్రి మాతృపూజ, గోమాత, భూమి పూజ, గంగామాత, తులసీ పూజలు నిర్వహించారు.
బుధవారం లలితా శాస్త్రనామ స్తోత్రనామ ప్రవచనాన్ని నిర్వహించారు. అంతకుముందు మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ తల్లిలో దైవాన్ని చూసే సంస్కృతిని పిల్లలకు చిన్నతనం నుంచే అలవాటు చేయాలన్న ఉద్దేశ్యంతో మాతృపూజ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. గురువారం గురుపాద పూజ, శుక్రవారం వర మహాలక్ష్మీ పూజలను పురస్కరించుకుని కనకధార దేవి పూజ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కులమత బేధాలు పేద, ధనిక అనే తేడా లేకుండా పూజల్లో పాల్గొనడం సంతోషం కలిగించిందన్నారు. కార్యక్రమంలో బాలాంజినేయస్వామి శిష్యులు బాలానందస్వామి, హరేరామ శర్మ శిష్యులు, నారాయణస్వామి, కాండ్ర సతీష్ బాబు, భక్తులు పాల్గొన్నారు.
ఏదో ఆశ...
Published Thu, Aug 7 2014 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement