క్వారీలో ప్రమాదం: ఒకరి మృతి
Published Sat, Dec 24 2016 11:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
చౌటుప్పల్: యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద క్వారీలో ప్రమాదం జరిగి ఒకరు మృతి చెందారు. క్వారీ డ్రిల్లింగ్ కోసం బ్లాస్టింగ్ జరపగా బండరాళ్లు పడి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల గ్రామానికి చెందిన జగన్(43) దుర్మరణం చెందారు. కాగా, నష్టపరిహారం ఇచ్చేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మృతుడి కుటుంబీకులు క్వారీ వద్ద ఆందోళనకు దిగారు. క్వారీ యాజమాన్యం బాధిత కుటుంబీకులతో చర్చలు జరుపుతోంది.
Advertisement
Advertisement