మందమర్రిలో సదాసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 2కే రన్ ప్రారంభమైంది.
మందమర్రి(ఆదిలాబాద్ జిల్లా): మందమర్రిలో సదాసేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 2కే రన్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ జాన్ వెస్లీ, బెల్లంపల్లి ఏసీపీ రమణారెడ్డి ప్రారంభించారు. 2కే రన్ సింగరేణి పాఠశాల మైదానం నుంచి మార్కెట్ వీధుల మీదుగా పోలీసు స్టేషన్ వరకు సాగుతుంది. పరుగుపందెంలో గెలుపొందిన ముగ్గురికి బహుమతులు అందజేస్తారు.