రాయచూరు రూరల్ : మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేందుకు ప్రతి జిల్లాలో మానసిక వైద్య కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మానసిక ఆరోగ్య ప్రాధికారం అధ్యక్షుడు అశోక్‌పై తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఏసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. డీఈఎం టీ పథకం కింద 2016 నాటికి రాష్ర్టంలోని ప్రతి జిల్లాలో 50 పడకల మానసిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుకు కేంద్రం రూ.2కోట్ల మేర కేటాయించిందన్నారు.
మహిళలు, యువతులపై జరుగుతున్న ఆత్యాచారాలనియంత్రణకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించామన్నారు. మానసిక అస్వస్థులకు శివమొగ్గలో మానసిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలో హైస్కూల్ స్థాయిలో 14-17 సంవత్సరాల మధ్య వయస్సున్న విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి లైంగిక విద్యా బోధన ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లాధికారి శశికాంత్ సెంథిల్, ఏసీ మారుతి, డీహెచ్‌ఓ సురేంద్రబాబు పాల్గొన్నారు.
ప్రతి జిల్లాలో ఓ మానసిక వైద్య కేంద్రం
Published Sat, Aug 23 2014 2:34 AM | Last Updated on Wed, Aug 1 2018 2:26 PM
Advertisement