ఏసీబీ వలలో పంచాయితీ సెక్రటరీ
Published Wed, Jan 4 2017 3:05 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
రాజమండ్రి: లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కాడు. తూర్పుగోదావరి జిల్లా కేశవపల్లి పంచాయతి సెక్రటరీగా పని చేస్తున్న ప్రసాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రసాద్ లంచం తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అదనపు వివరాల కోసం అతన్ని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement