
సచివాలయంలో ఏసీబీ దాడులు
అమరావతి: ఏపీ సచివాలయంలో ఏసీబీ అధికారులు శుక్రవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటున్న సెక్షన్ ఆఫీసర్ శ్రీనాథ్‌ను వలపన్ని పట్టుకున్నారు. శ్రీనాథ్ హోంశాఖ విభాగంలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. డబ్బును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.