= ఢిల్లీలో పార్టీ పెద్దల నిర్ణయం
= అయినా సంక్రాంతి వరకూ ఆగాల్సిందే
= ఆలోగా ఆద్వానీతో సయోధ్యకు యత్నాలు
= ఎలాంటి షరతు లేకుండా చేరేందుకు ‘అప్ప’ సమ్మతి!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్ప తిరిగి బీజేపీలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికిప్పుడే కాకుండా సంక్రాంతి తర్వాత ఆయన సొంత గూటికి చేరుకోనున్నారు. ఈమేరకు పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యమంత్రుల సమావేశం అనంతరం ఈ విషయంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో గుజరాత్
యడ్డి చేరికకు పచ్చజెండా!
ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, సీనియర్ నేతలైన ఎల్.కే అద్వానీ, సుష్మాస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత యడ్డి విషయం కమల నాథుల మధ్య చర్చకు వ చ్చింది. దేశమంతటా కాంగ్రెస్ వ్యతిరేక గాలి వీస్తున్న తరుణంలో కర్ణాటకలో దాని నుంచి పూర్తి స్థాయి లాభం పొందాలంటే యడ్యూరప్పను చేర్చుకోక తప్పదని రాష్ట్రం నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు మాజీ సీఎం శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం అర్.అశోక్ పెద్దల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగే వర్గాల్లో మొదటిస్థానంలో ఉన్న లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ‘అప్ప’ను తప్పక పార్టీలోకి తీసుకోవలసిన అవసరం ఉందని వారు పునరుద్ఘాటించారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇదే సందర్భంలో కర్ణాటకలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో యడ్డి వేరుకుంపటి పెట్టుకోవడం వల్ల పార్టీ ఎలా నష్టపోయింది కూడా వారిరువురూ కమలనాథులకు వివరించారట. యడ్యూరప్ప కూడా రాజకీయంగా తనకు సన్నిహుతుడైన నరేంద్రమోడీని ప్రధాన మంత్రిగా చేయడం కోసం తన వ ంతు కృషి చేస్తానని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే.
దీంతో పార్టీ హై కమాండ్ ‘అప్ప’ చేరికకు అంగీకరించిన ట్లు తెలుస్తోంది. అందరు పెద్దలు అంగీకరించినా బీజేపీ కురువృద్ధుడైన అద్వానీ మాత్రం ఇంకా సుముఖత వ్యక్తం చేయకపోవడం వల్లే వెంటనే కాకుండా సంక్రాంతి తర్వాత యడ్యూరప్ప బీజేపీ తీర్థం తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతలోపు అద్వానీని ప్రసన్నం చేసుకోవచ్చని... అవసరమనుకుంటే యడ్డితోనే అద్వానీతో నేరుగా మాట్లాడించవచ్చనేది రాష్ట్ర నాయకుల ఆలోచన. ధనుర్మాసం వెళ్లిన తర్వాత అంటే సంక్రాంతి తర్వా త యడ్యూరప్ప బీజేపీలో చేరుతారనే వాదన అటు బీజేపీతో పాటు కేజేపీలో వినిపిస్తోంది.
ఎటువంటి షరతు విధించకపోవడం వల్లే!
ఇప్పటి వరకూ తనకు బీజేపీలో ఉన్నత పదవితోపాటు కేజేపీలోని మిగిలిన నాయకులకు పార్టీలో ‘సరైన స్థానం’ కోసం పట్టుబట్టిన యడ్యూరప్ప తన పట్టును సడలించి ఎటువంటి షరతులు విధించకపోవడం వల్లే ఆయన సొంతింటికి మార్గం సుగమం అయినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గత సోమవారం శివమొగ్గ జిల్లాలోని సొరబలో యడ్డితో ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వారిద్దరి మధ్య ‘భేషరతు విషయమై’ ఒప్పందం కుదరడం వల్లే యడ్డి చేరికకు మార్గం సుగమమైనట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు.
యడ్డి చేరికకు పచ్చజెండా!
Published Thu, Dec 26 2013 4:41 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement