అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది.
పుణే: అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీలోగా తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ విషయాన్ని ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వెల్లడించారు. దాంగేచౌక్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. నెల రోజుల్లోగా ఓ నిర్ణయం తీసుకుంటామంటూ నాగపూర్‌లో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అభయమిచ్చారని, ఇందుకు సంబంధించిన ప్రక్రి య పూర్తికావస్తోందని పవార్ అన్నారు.
అయితే అక్రమ నిర్మాణాలన్నింటినీ క్రమబద్ధీకరించడం సాధ ్యం కాదని, ముఖ్యంగా అభివృద్ధి ప్రణాళిక కోసం ఉంచిన స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణ కుదరదని ఆయన తేల్చిచెప్పారు.
తమ పార్టీ నేతృత్వంలో వివిధ శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశం పట్టణాభివృద్ధిశాఖ పరిధిలో ఉందని, ఆ శాఖకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సారథ్యం వహిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నియమావళి త్వరలో అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల మెట్రో వంటి ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి జిల్లాలో 937 అంబులెన్సు సేవలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1,000 కోట్లని, ఇందులో రూ. 600 కోట్లను భరిం చేందుకు రాష్ర్ట ప్రభుత్వం, మిగతాది కేంద్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుందన్నారు. ఈ అంబులెన్సులలో నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. పుణే జిల్లాకు ఐదు అంబులెన్సులను కేటాయిస్తామన్నారు.