డ్యూటీ చేయకున్నా.. జీతం డ్రా | allegations on Panchayat Secretary in mahabubabad | Sakshi
Sakshi News home page

డ్యూటీ చేయకున్నా.. జీతం డ్రా

Published Fri, Oct 28 2016 12:19 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM

ఏడు నెలల వేతన ఏరియర్స్‌ కోసం తయారు చేసిన బిల్లు

ఏడు నెలల వేతన ఏరియర్స్‌ కోసం తయారు చేసిన బిల్లు

ఏడు నెలలపాటు విధులకు డుమ్మా.. 
అయినా పూర్తి కాలానికి వేతనం విడుదల 
ఈఓపీఆర్‌డీ, ఎంపీడీఓ సహకారంతో  
పంచాయతీ కార్యదర్శి లీలలు
కనీసం సెలవు పత్రం ఇవ్వని వైనం 
కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు 
విచారణ చేపట్టిన జిల్లా పంచాయతీ అధికారి 
 
మహబూబాబాద్‌ : ఆయనొక పంచాయతీ కార్యదర్శి.. ఉండేది విజయవాడలో.. ఉద్యోగం చేసేది మాత్రం దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో. చెప్పా పెట్టకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరు కావడం ఆయన నైజం. అయినా ఆయనకు స్థానిక అధికారులు ఒక్క మెమో ఇవ్వడం కాదు  కదా.. కనీసం మందలించడం కూడా చేయలేదు. డ్యూటీ తప్పించిన కాలానికి సెలవు కూడా పెట్టకుండా, ఏడు నెలల జీతం ఎత్తుకోగల నేర్పరితనం ఆయనది. స్థానిక ఎంపీడీఓ, ఈఓపీఆర్‌డీ ప్రోత్సాహం, సహకారంతో గుట్టుగా చేసిన వ్యవహారం అధికారుల మధ్య వచ్చిన గొడవతో బట్టబయలైంది. 
 
అసలేం జరిగిందంటే... 
వి.శ్రీనివాసరావు అనే పంచాయతీ ఉద్యోగి పూర్వ నర్సింహులపేట మండలం.. ప్రస్తుత దంతలాపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ముంగిమడుగు, రామన్నగూడెం, గుండంరాజుపల్లి గ్రామాలను కూడా ఇ¯ŒSచార్జీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని విజయవాడ నుంచి వచ్చి వెళ్తుంటాడు. దీంతో తరుచూ విధులకు డుమ్మా కొడుతుంటాడు. ఒక్కొక్క సారి నెలల తరబడి కనిపించకుండా వెళ్తాడు. ఇలా 2015లో జనవరి, ఫిబ్రవరిలో రెండు నెలలు చెప్పాపెట్టకుండా విధులకు గైర్హాజరయ్యాడు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. తర్వాత తిరిగి రాగానే స్థానిక అధికారులు రెండు నెలల జీతం చేసి పువ్వుల్లో పెట్టి ఇచ్చారు. అలాగే మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు. ఈ సారి ఏకంగా ఏడు నెలల వరకు రాలేదు. అధికారులకు లీవ్‌ లెటర్‌ కూడా ఇవ్వలేదు. దీంతో ఆ గ్రామాలను వేరే పంచాయతీ కార్యదర్శులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించిన ఈఓపీఆర్‌డీ, ఎంపీడీఓలు అతడు అబ్‌ స్కాండింగ్‌(కనిపించకుండా పోవడం)లో ఉన్నట్లు గానీ, సెలవు పెట్టినట్లుగానీ ఉన్నతాధికారులకు సమాచారమివ్వలేదు.  తీరా 7 నెలల తర్వాత ఆగస్టులో మళ్లీ తానో ఉద్యోగం చేస్తు న్న విషయం గుర్తుకొచ్చి శ్రీనివాసరావు తిరిగొచ్చా డు. వచ్చి రావడంతో నే ఆయనకు ఏడు నెలల ఏరియర్స్‌ (రూ.1,00,097) ఎంపీడీఓ, ఈఓపీర్‌డీ కలిసి ఒకేసారి మంజూరు చేశా రు. ఈ వ్యవహారమంతా ఎంపీడీఓ కార్యాలయంలోని సంబంధిత సూపరిం టెండెంట్, సీనియర్‌ అసిస్టెంట్‌ సంతకాలు లేకుండా నే సాగినట్లు తెలిసింది. విధులకు హాజరు కానీ ఉద్యోగికి గైర్జాజర్‌ వేసి,ఉన్నతాధికారులకు నివేదించి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అతడిని ప్రోత్సహించడం అనుమానాలకు తావి స్తోంది. కాగా ఈ వ్యవహారంపై పలువురు ఈ నెల 17న గ్రీవెన్స్‌సెలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ విషయమై జిల్లా పంచాయతీ కార్యాలయంలో కలిసిన నర్సిం హులపేట ఈఓపీఆర్‌డీ ఎ.గవర్రాజును ‘సాక్షి’ వివర ణ కోరగా శ్రీనివాసరావు విధులకు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడని, అనారోగ్యంతో ఉన్నానంటే రిక్వెస్ట్‌ మీద జీతం చేశామని చెప్పడం గమనార్హం. కానీ అత డు రాని రోజుల్లో ఆబ్సెంట్‌ వేయాలి కదా అనే ప్రశ్నకు వారి వద్ద సమాధానం లేదు. డీపీఓ విచారణ లో అధికారులపై వేటు  పడే అవకాశం ఉంది.
 
రిక్వెస్ట్‌ చేయడం వల్ల జీతం ఇచ్చాం
శ్రీనివాసరావు అనారోగ్యంతో ఉండటం కారణంగానే సక్రమంగా విధులకు హాజరుకాలేదు. ఫిబ్రవరి నుంచి కుమ్మరికుంట్ల గ్రామానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు విధులు సక్రమంగా నిర్వహించలేదు. విధులకు డుమ్మా కొట్టాడు. దీంతో కొన్ని నెలలు పడమటిగూడెం పంచాయతీ కార్యదర్శికి కొన్ని బాధ్యతలు అధికారికంగా కాకుండా అప్పగించాం. కానీ శ్రీనివాసరావు పొరపాటు జరిగిందని రిక్వెస్ట్‌ చేయడం వల్ల ఆ నాలుగు నెలల వేతనాన్ని ఇచ్చాం. ప్రస్తుతం విధులకు హాజరవుతున్నారు కానీ అనారోగ్య సమస్యతో సక్రమంగా రావడం లేదు. 
–ఈఓపీఆర్‌డీ ఎ.గవర్రాజు
 
రెగ్యులర్‌గా రాలేదు  
మహబూబాబాద్‌ : కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు రెగ్యులర్‌గా విధులకు హాజరుకానీ మాట నిజమే. అనారోగ్యం కారణం చెబుతూ వచ్చారు. ఆ ఉద్యోగి విధులకు డుమ్మా కొట్టడం వల్ల మరో పంచాయతీ కార్యదర్శి యాకయ్యకు ఆ బాధ్యతలు అప్పగించాం. లాంగ్‌ లీవ్‌ పెట్టకుండా అప్పుడప్పుడు సెలవు పెడుతూ విధుల కు పూర్తి స్థాయిలో హాజరుకాలేదు. మెడికల్‌ బిల్లులు చూపడం వలనే వేతనాలు ఇచ్చాం. 
ఎంపీడీఓ టి.ఉపేందర్‌
 
అధికారులను విచారిస్తున్నా
కుమ్మరికుంట్ల పంచాయతీ కార్యదర్శి విషయంపై విచారణ చేపడుతున్నాం. ఈ విషయమై ఈఓపీఆర్‌డీ గవర్రాజును నేను వివరణ అడుగగా ఎంపీడీఓనే వేతనాలు ఇచ్చారని బదులిచ్చారు. అయితే విధులకు డుమ్మా కొట్టినట్లు మాత్రం ఆయన అంగీకరించారు. ఆ పంచాయతీ కార్యదర్శి సెలవు పెట్టలేదని కానీ అనారోగ్యంతో విధులకు హాజరుకాలేదని మాత్రమే సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం. 
–జిల్లా పంచాయతీ అధికారి రాణిభాయి 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement