దివ్యాంగ కార్యదర్శిని ఆస్పత్రిలో పరామర్శిస్తున్న అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్
బయ్యారం: ‘నాది మధ్యతరగతి కుటుంబం. మా కాడ ఎవరూ పెట్టుబడి పెట్టరు. కార్య దర్శినే పెట్టుకోవాలి. ఇదెక్కడి న్యాయం? ట్రాక్టర్ పర్సంటేజీలు తీసుకునేది సర్పంచ్‌లు. కానీ కార్యదర్శి డీజిల్ పోయించి ట్రాక్టర్ నడపాలా.. వారికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా.. బానిస బతుకా సార్’ అంటూ ఎంఏ బీఈడీ చదివిన ఓ దివ్యాంగ పంచాయతీ కార్యదర్శి శుక్రవారం సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా అదే మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఈసం వెంకటేష్ 16 నెలలుగా పనిచేస్తున్నాడు. గ్రామంలో వాడే ట్రాక్టర్‌కు డీజిల్‌ను రోజూ తన డబ్బులతోనే కొంటున్నాడు. వాటి బిల్లుల కోసం వెళ్లితే జాయింట్ చెక్ పవర్ ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సంతకాల కోసం తిప్పించుకుంటున్నారు. దీంతో కలత చెందిన వెంకటేష్ ఇంటివద్ద పురుగుమందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
సూసైడ్ నోట్‌లో ఏముందంటే..
‘అడిషనల్ కలెక్టర్ మేడం... కలెక్టర్ సార్.. గ్రా మంలో ఏమైనా ఖర్చులు పెట్టాల్సి వస్తే కా ర్యదర్శి పెట్టాలి అని ఏమైనా చట్టంలో ఉందా.. మేమూ మనుషులమే. మమ్మల్ని బలిపశువుల్ని చేశారు. పాలేరు కంటే ఎక్కువగా వాడుకుం టున్నారు. ఉపసర్పంచ్ సంతకం ఏమైనా రాష్ట్రపతి సంతకమా? అ, ఆ..లు రానివాళ్లు సర్పంచ్, ఉపసర్పంచ్‌లు అయితే మా పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment