శ్రీలంకలో నిర్వహించనున్న ఆర్మీ చ ర్చా వేదికకు భారత్ నుంచి ప్రతినిధి వె ళ్తుండడంపై వ్యతిరేకత మొదలైంది. ఆ చర్చను బహిష్కరించాలన్న నినాదంతో ఆదివారం నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఆ పార్టీ నేత సీమాన్ నేతృత్వంలో చెన్నైలోని శ్రీలంక దౌత్య కార్యాలయం ముట్టడికి యత్నించారు.
సాక్షి, చెన్నై: శ్రీలంకలో జరిగే ఎలాంటి వేడుకలకు భారత్ నుంచి ప్రతినిధి వెళ్లకూడదని, అలాగే, అక్కడి నుంచి ఇక్కడి వేడుకలకు ఏ ఒక్కరూ హాజరు కాకూడదన్న హెచ్చరికను ఈలం తమిళాభిమాన సంఘాలు, పార్టీలు తరచూ ఇస్తున్నాయి. అయినా వారి హెచ్చరికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం శ్రీలంకలో ఆర్మీ ఘనతను చాటే రీతిలో చర్చా వేదిక సోమవారం నుంచి మూడు రోజులపాటుగా నిర్వహిం చనుంది. ఈ చర్చా వేదికగా అన్ని దేశాల ఆర్మీ అధికారులను శ్రీలంక ఆహ్వానించింది. భారత్ నుంచి అధికారులు అక్కడికి పయనం అయ్యేందుకు రెడీ అవుతున్న సంకేతాలతో తమిళనాట వ్యతిరేకత బయలుదేరింది. తాము వ్యతిరేకిస్తున్నా, కేంద్రం ప్రతినిధిని పంపడం ఎంత వరకు సమంజసమంటూ తమిళాభిమాన సంఘాలు, పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి.
నిరసన: ఆర్చీ చర్చలో భారత ప్రతినిధులు పాల్గొనకూడదన్న నినాదంతో నామ్ తమిళర్ కట్చి నేతృత్వంలో ఆదివారం రాష్ట్రంలో పలు చోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి. చెన్నైలో ఆ పార్టీ నేత సీమాన్ నేతృత్వంలో కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా నుంగంబాక్కం చేరుకున్నారు. అక్కడి నుంచి శ్రీలంక దౌత్య కార్యాలయం మార్గం వైపుగా చొచ్చు కెళ్లారు. ఈ హఠాత్పరిణామాన్ని గుర్తించిన ఆ పరిసరాల్లోని భద్రతా సిబ్బంది నిరసనకారులను అడ్డుకున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, ముందుకు వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. శ్రీలంకకు వ్యతిరేకంగా నిరసన కారులు నినదించారు. ఆర్మీ చర్చలో భారత ప్రతినిధులు పాల్గొంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రోడ్డుపై ఆందోళనకారులు బైఠాయించి నిరసనకు దిగడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చివరకు పోలీసులు ఆందోళనకారులను బుజ్జగించే యత్నం చేసి, సఫలీకృతులయ్యారు.
యూపీఏ బాటలోనే : ఈలం తమిళుల విషయంలో, జాలర్ల సమస్య పరిష్కారంలో యూపీఏ బాటలోనే బీజేపీ సర్కారు సైతం పయనిస్తోందని సీమాన్ మండిపడ్డారు. రెండు పార్టీలకు, ప్రభుత్వాలకు తేడా లేదని, రెండూ దొందు దొందేనని విమర్శించారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సేను తన ప్రమాణ స్వీకారానికి రెడ్ కార్పెట్‌తో ఆహ్వానించిన రోజునే తమిళుల మీద చిత్తశుద్ధి ప్రధాని నరేంద్ర మోడీకి ఏ పాటిదో స్పష్టమైందన్నారు. రానురాను యూపీఏ బాణిలో మోడీ సర్కారు పయనిస్తోందని ధ్వజమెత్తారు. తమిళులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే, ఎలాంటి పరిణామాలు చవిచూడాల్సి వస్తుందో అన్న విషయం లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు తెలియవచ్చిందన్నారు. ఇదే పరిస్థితి బీజేపీకి ఏర్పడకుండా ఉండాలంటే, ఈలం తమిళుల మీద, తమిళ జాలర్లకు భద్రత కల్పించడంలో కృషి చేయండంటూ హితవు పలికారు. సోమవారం నుంచి శ్రీలంకలో జరగనున్న ఆర్మీ చ ర్చా వేదికకు భారత్ నుంచి ప్రతినిధులు ఎవ్వరూ వెళ్లకూడదని, ఒక వేళ వెళ్లిన పక్షంలో తమిళుల ఆగ్ర హం ఏ పాటిదో చవిచూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
‘ఆర్మీ చర్చా పై వ్యతిరేకత
Published Sun, Aug 17 2014 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement