100కే స్వరపేటిక పరికరం | artificial larynx inserter 100 rupees only | Sakshi
Sakshi News home page

100కే స్వరపేటిక పరికరం

Published Wed, Dec 21 2016 1:41 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

100కే స్వరపేటిక పరికరం

100కే స్వరపేటిక పరికరం

సాక్షి, బెంగళూరు: ‘గొంతు క్యాన్సర్‌’ బాధితులకు కృత్రిమ స్వర పేటికను సులభంగా అమర్చే నూతన పరికరాన్ని (ఇన్సర్టర్‌) బెంగళూరుకు చెందిన ప్రముఖ క్యాన్సర్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ యూఎస్‌ విశాల్‌రావ్‌ రూపొందించారు. దీన్ని రూ. 100కే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. రావి చెట్టు చెక్కను పరికరం తయారీలో వాడారు. ఈ ఇన్సర్టర్‌కు ‘శుశృత’ అని పేరుపెట్టారు. దీని ద్వారా కృత్రిమ స్వరపేటికను ఇద్దరు రోగులకు విజయవంతంగా అమర్చినట్లు విశాల్‌ వెల్లడించారు. తాను రూపొందించిన ఇన్సర్టర్‌తో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా 5 నిమిషాల్లోనే గొంతులో అమర్చవచ్చని డాక్టర్‌ విశాల్‌ చెప్పారు.

శుశృత పని చేస్తుందిలా..
శుశృత (ఇన్సర్టర్‌) రావి చెట్టు చెక్కతో తయారవుతుంది. ఇందులో ‘సిలిండర్, పిస్టన్, పాలిథీన్‌ ట్యూబ్‌’ అనే మూడు భాగాలు ఉంటాయి. ఇందులో సిలెండర్‌లో పాలిథీన్‌ ట్యూబ్‌ను ఉంచి అందులో కృత్రిమ స్వరపేటికను ఉంచుతారు. తర్వాత గొంతు వద్ద చిన్న రంధ్రం చేసి సిలిండర్‌ను ఉంచి పిస్టన్‌ను నొక్కి రోగి గొంతులో స్వరపేటికను అమర్చుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement