
27న తెరపైకి ఇంజి ఇడుప్పళగి
ఈ నెల 27న ఇంజి ఇడుప్పళగి చిత్రం విడుదల కానుంది. ఆర్య, అనుష్క జంటగా నటించిన చిత్రం ఇంజి ఇడుప్పళగి. ద్విభాషా చిత్రంగా పీవీపీ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగులో జీరోసైజ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కోవెలమూడి ప్రకాష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని అనుష్క నటించిన రుద్రమదేవికి పోటీగా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఆ తరువాత ఇంజి ఇడుప్పళగి చిత్ర విడుదలను ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
నటి అనుష్క విభిన్నమైన పాత్రను పోషించారు. ఈ చిత్రం కోసం సుమారు 20 కిలోల బరువు పెరిగి నటించడం విశేషం. చిత్రం టీజర్ విడుదలయ్యి ఇప్పటికే మంచి స్పందన పొందింది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా మరగదమణి సంగీత బాణీలందించిన ఈ ద్విభాషా చిత్రానికి నీరవ్‌షా ఛాయాగ్రహణను అందించారు. చిత్రాన్ని ఈ నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు.