నగరంలో రేపు నీటి సరఫరా బంద్
Published Wed, Apr 19 2017 11:30 AM | Last Updated on Tue, Sep 5 2017 9:11 AM
ముంబై : నగరానికి నీటి సరఫరా చేసే వివిధ జల కేంద్రాలలో గురువారం మరమ్మతు పనులు చేపట్టనున్నారు. దీంతో పార్వతి, రా వాటర్ పంపింగ్, వడ్గావ్, లష్కర్, ఎస్‌ఎన్‌డీటీ, నవీన్ హోల్కర్ జల కేంద్రాల నుంచి నీరు విడుదలయ్యే ప్రాంతాలకు గురువారం పూర్తిగా నీటి సరఫరా కాదని కార్పొరేషన్ అధికారులు స్పష్టం చేశారు. మరమ్మతులు పూర్తయిన తరువాత శుక్రవారం తక్కువ ఒత్తిడితో నీటి సరఫరా అవుతుంది. దీంతో నగర ప్రజలు ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నీటి సరఫరా కాని ప్రాంతాలు
దత్తవాడి, స్వార్ó ట్, పార్వతి దర్శన్, లోకమాన్య నగర్, డెక్కన్ పరిసరాలు, శివాజీనగర్ పరిసరాలు, ముఖుంద్‌నగర్, సహకార్ నగర్, సాతారా రోడ్, పద్మావతి, బిబ్వేవాడి, కాత్రజ్, ధనక్‌వాడి, ఇందరానగర్, ఎస్‌ఎన్‌డీటీ, లా కాలేజీ రోడ్, శివ్‌నేరి నగర్, భాగ్యోదయ్ నగర్, జ్ఞానేశ్వర్‌నగర్, సాయిబాబా నగర్, హింగణే, బోపోడీ, ఖడ్కి, చతుశృంగి, గోఖలేనగర్, రామ్‌బాగ్, గురు గణేశ్ నగర్, పుణే యూనివర్సిటీ, మహాత్మ సొసైటీ, అహిరేగావ్, ఔం«ద్, భావ్‌ధన్, సుతార్ వాడి, పుణే రైల్వే స్టేషన్ రోడ్, కోరేగావ్ పార్క్, సాడివాలా రాస్తా, రేస్ కోర్స్, వన్వాడీ, హడప్సర్, యేర్వాడ పరిసరాలు, విశ్రాంతివాడి, నగర్ రోడ్, కల్యాణీనగర్, మహారాష్ట్ర హౌసింగ్ బోర్డు కాలనీ, చందన్‌నగర్, షోలాపూర్ రోడ్, సాతవ్‌వాడి, విద్యానగర్, టింగరే నగర్, కలస్, ధానోరీ, లోహగావ్, విశ్రాంతివాడి, విమాన్‌నగర్ తదితర ప్రాంతాలున్నాయి.
Advertisement
Advertisement