'కుడిచేత్తో ఇచ్చి..ఎడమ చేత్తో లాక్కున్నట్టుంది'
Published Thu, Mar 16 2017 12:35 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
హైదరాబాద్: సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై హైకోర్టులో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లనే ఉద్యోగాల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వ తీరు కుడి చేతితో ఇచ్చి.. ఎడమ చేతితో లాక్కున్నట్టుందని మండిపడ్డారు. ఇది చేతల ప్రభుత్వం కాదని, మాటల ప్రభుత్వమని రుజవైందని కిషన్ రెడ్డి తెలిపారు.
కాగా సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. కాగా వారసత్వ ఉద్యోగాల నియామకాలను సవాల్ చేస్తూ గోదావరిఖనికి చెందిన సతీష్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. 30వేల వారసత్వ ఉద్యోగాల వల్ల తమకు ఉద్యోగ అవకాశాలు రావంటూ అతడు తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ప్రభుత్వ నిర్ణయం వల్ల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఫిర్యాదులో తెలిపారు.
Advertisement
Advertisement