చెన్నై, సాక్షి ప్రతినిధి:తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా జాతీయ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు గురువారం చెన్నై పర్యటనకు ఎందుకొచ్చారో చెప్పలేక చతికిల పడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన, సమైక్య వాదులు ఢిల్లీకి చేరుకోగా, ప్రాంతీయ పార్టీల నేతల మద్దతు కూడగట్టే పేరుతో నారా చంద్రబాబు చెన్నై చేరుకున్నారు. ముందుగా పోయస్ గార్డెన్‌లో సీఎం జయతో 45 నిమిషాలు, అన్నా అరివాలయం (డీఎంకే కేంద్ర కార్యాలయం)లో కరుణానిధితో 30 నిమిషాలు మాట్లాడారు. రెండు చోట్ల నుంచి వెలుపలికి రాగానే మీడియాతో మాట్లాడారు. ఏపీ రాజకీయాలు తెలంగాణ, సమైక్యాంధ్ర అంటూ రెండుగా చీలిపోవడంపై జాతీయ మీడియా ఇంతకూ మీ వైఖరి ఏంటని పదే పదే ప్రశ్నించినా దాటవేసే సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదు,
ఎందుకొచ్చారో..?
Published Fri, Feb 7 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 3:24 AM
అలాగని అనుకూలమూ కాదన్నారు. తెలుగువారికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందంటూ పొంతన లేని మాటలు చెప్పారు. ఆర్టికల్ 356ని అడ్డంపెట్టుకుని ఒకనాడు ఎన్టీఆర్‌ను, మరోసారి ఎంజీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం పదవీచ్యుతుడిని చేసిందని చెప్పారు. తెలంగాణ అంశంపై ఇరుప్రాంతాల వారితో చర్చించాలి, ఇరుప్రాంతాల ప్రజల సెంటిమెంట్లు కాపాడాలి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని అనుసరించాలని వ్యాఖ్యానించారు. ఫెడరలిజంలో కరుణ చాంపియన్ అంటూ మెచ్చుకున్నారు. రెండుచోట్ల కలిపి సుమారు అరగంటపాటూ మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఇంతకూ జయ, కరుణలను కలిసి తెలంగాణకు లేక సమైక్యాంధ్రకు మద్దతు కోరారా, లేక మరేమైనా ఉందా అనే అంశాన్ని స్పష్టం చేయలేదు.
కాంగ్రెస్ వైఖరిని వారి దృష్టికి తీసుకెళ్లానని మాత్రమే చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో వారికి తెలియదా అని ప్రశ్నిస్తే, అది తన ఉద్దేశం కాదని చెప్పారు. చంద్రబాబు పర్యటనలో క్లారిటీ కోసం పడరానిపాట్లు పడిన బాబు ఁవాట్ అయాంసేయింగ్‌రూ....్ఙఅయాం వెరీ క్లియర్‌రూ. అనే రెండు ఇంగ్లీషు ముక్కలు పదేపదే వల్లిస్తూ చివరకు నిరాశతో వెనుదిరిగారు. ఆయన చివరి వరకూ జయ, కరుణలను కలిసి ఏం చెప్పారు? ఎందుకు వచ్చారో మాత్రం వెల్లడించకుండానే వెళ్లిపోయూర. బాబు వెంట ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రేవడి ప్రకాష్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఉన్నారు.
Advertisement
Advertisement