జయలలిత మృతిపై కరుణానిధి సంతాపం | Jayalalithaa name and fame will remain forever | Sakshi
Sakshi News home page

జయ గురించి కరుణానిధి ఏమన్నారంటే..

Published Tue, Dec 6 2016 4:22 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

జయలలిత మృతిపై కరుణానిధి సంతాపం

జయలలిత మృతిపై కరుణానిధి సంతాపం

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పేరుప్రఖ్యాతలు చిరస్థాయిగా నిలిచిపోతాయని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్నారు. జయలలిత మృతి పట్ల ఆయన మంగళవారం సంతాపం తెలిపారు.

'పార్టీ సంక్షేమం కోసం, భవిష్యత్తు కోసం జయలలిత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహానికి తావులేదు. చిన్నవయస్సులోనే ఆమె కన్నుమూసినా ఆమె పేరుప్రఖ్యాతలు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి' అని ఒక ప్రకటనలో కరుణానిధి పేర్కొన్నారు.

గతకొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధి తన సంతాప సందేశాన్ని అన్నాడీఎంకేకు పంపించారు. రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత బద్ధవిరోధులు అన్న విషయం తెలిసిందే. కాగా, ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్‌ రాజాజీ హాల్‌కు వెళ్లి జయలలిత భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement