ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్ | Chhota Shakeel's plot to kill Rajan foiled, 4 arrested: Police | Sakshi
Sakshi News home page

ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్

Published Fri, Jun 10 2016 2:17 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్

ఛోటా రాజన్ హత్యకు కుట్ర, నలుగురి అరెస్ట్

న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ను హత్య చేసేందుకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఛోటా షకీల్ గ్యాంగ్ పన్నిన కుట్రను పోలీసులు చేధించారు. రాజన్ను చంపేందుకు రంగంలోకి దింపిన నలుగురు కాంట్రాక్ట్ కిల్లర్లు రాబిన్సన్, జునైద్, యూనిస్, మనీశ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛోటా రాజన్ను కోర్టుకు తీసుకెళ్లే సమయంలో చంపాలని వీరు పథకం పన్నినట్టు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

ఛోటా షకీల్తో నిందితులు ఫోన్ సంభాషణలు సాగించినట్టు గుర్తించామని, అనంతరం వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు స్పెషల్ పోలీస్ కమిషనర్ (స్పెషల్ సెల్) అరవింద్ దీప్ చెప్పారు. జూన్ 3వ తేదీన వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, 5 రోజులు పోలీసుల రిమాండ్కు అప్పగించారు. విచారణ అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ కస్టడీకి అదేశించినట్టు అరవింద్ దీప్ చెప్పారు. ఓ నిందితుడి నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్లో ఇండోనేసియాలో అరెస్ట్ అయిన ఛోటా రాజన్ను భారత్కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement