సాక్షి, న్యూఢిల్లీ:బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ విచారించడాన్ని బీజేపీ స్వాగతించింది. ఈ కుంభకోణంలో లబ్ధిపొందిన కార్పొరేట్ వ్యక్తులతో పాటు రాజకీయ శక్తులను సీబీఐ బయటకు తీయాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించింది. గతంలో యూపీఏ పదేళ్ల ప్రభుత్వం బొగ్గు కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, స్వాతంత్య్రానంతరం దేశంలో ఇదే భారీ కుంభకోణమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో అన్నారు. సీబీఐ, ఈడీ వంటి సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని కుంభకోణాన్ని తొక్కిపెట్టే యత్నాలు అనేకం యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగాయని, కానీ అవే సంస్థలు ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని చెప్పారు.
గనుల కేటాయింపులతో లబ్ధిపొందిన కార్పొరేట్ శక్తులను ప్రశ్నిస్తున్నప్పుడు, వాటివల్ల లబ్ధి గడించిన రాజకీయ శక్తులను ప్రశ్నించాల్సి ఉంటుందని, ఆ శక్తులన్నింటినీ బయటకు తీయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ జైలులో ఉన్న ఉగ్రవాది జియహర్ రెహమాన్ లఖ్వీని భారత్‌కు అప్పగించాలని యూఎస్, యూకేలు చేసిన డిమాండ్‌ను ఆయన స్వాగతించారు. లఖ్వీతో పాటు హఫీజ్ సయీద్, దావూద్ ఇబ్రహీంలను సైతం భారత్‌కు అప్పగించేలా అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవాలని కోరారు.
మాజీ ప్రధాని మన్మోహన్‌ను సీబీఐ విచారించడాన్ని స్వాగతిస్తున్నాం
Published Wed, Jan 21 2015 11:29 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM
Advertisement
Advertisement