మెట్రో స్టేషన్లలో కండోమ్‌ల విక్రయం! | Condom sales in metro stations | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్లలో కండోమ్‌ల విక్రయం!

Published Thu, May 1 2014 10:31 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM

మెట్రో స్టేషన్‌లలో ఇక నుంచి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ మెట్రో స్టేషన్లలో వెండింగ్ మెషీన్‌ల ద్వారా ఇవి ప్రయాణికులకు అందేలా

 న్యూఢిల్లీ: మెట్రో స్టేషన్‌లలో ఇక నుంచి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు అందుబాటులో ఉండనున్నాయి. వివిధ మెట్రో స్టేషన్లలో వెండింగ్ మెషీన్‌ల ద్వారా ఇవి ప్రయాణికులకు అందేలా మెట్రో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కేరళకు చెందిన హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ సహాకారంతో దీనికి శ్రీకారం చుట్టారు. ఎంపిక చేసిన స్టేషన్లలో వెండింగ్ మెషీన్‌లలో శానిటరీ నాప్కిన్స్, గర్భ నిరోధక మాత్రలు, కండోమ్‌లు, అయుర్వేదిక ఉత్పత్తులు ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 21 మెట్రో స్టేషన్లలో తొలి విడతలో 25 వెండింగ్ మెషీన్‌లు అమరుస్తామని హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ చైర్మన్ ఎం.అయ్యప్పన్ తెలిపారు. భారత కరెన్సీ నోట్లు, బిల్లలు మెషీన్‌లలో ఇన్‌సర్ట్ చేస్తే ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు వస్తాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement