విశాఖలో ఎదురుకాల్పులు : మావోలకు గాయాలు | Cross firing between police and maoists in visakha forest area | Sakshi
Sakshi News home page

విశాఖలో ఎదురుకాల్పులు : మావోలకు గాయాలు

Published Thu, Oct 6 2016 9:34 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM

Cross firing between police and maoists in visakha forest area

విశాఖ : విశాఖ జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జీకే వీధి మండలం కుంకంపూడి, పెదపాడు మధ్య అటవీ ప్రాంతంలో బుధవారం రాత్రి కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో కాల్పులు జరిగినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.  
 
పోలీసుల కాల్పుల్లో దళ అసిస్టెంట్ కమాండర్, దళ సభ్యులకు గాయాలైనట్లు ఎస్పీ చెప్పారు. గాయపడిన మావోయిస్టులకు జీకే వీధి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని విశాఖకు తరలించారు. ఈ కాల్పుల్లో పోలీసులకు ఎలాంటి గాయాలు కాలేదని ఎస్పీ తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్లో మరి కొంతమంది మావోయిస్టులు పారిపోయినట్లు తెలుస్తోంది. పట్టుబడిన మావోయిస్టులను మువ్వల అంబ్రి, గిన్నెల నర్సింగ్, శోభన్ లుగా గుర్తించారు. నర్సింగ్, శోభన్లపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement