
మహానేతకు ఘననివాళి
మహానేత ఏడవ వర్థంతిని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
ఇడుపులపాయ: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏడవ వర్థంతిని ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆయన తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, సోదరి షర్మిల తదితరులు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
అనంతరం వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు, అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ తెలుగురాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.