సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గ ఓటర్లు మరోమారు ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చనున్నారు. గత ఎన్నికల్లో షీలాదీక్షిత్‌ను భారీ మెజారిటీతో ఓడించిన కేజ్రీవాల్...ఇక్కడినుంచి రెండోసారి పోటీచేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మాజీ మంత్రి కిరణ్‌వాలియాను నిలబెట్టగా, బీజేపీ తరఫున డూసూ మాజీ అధ్యక్షురాలు నుపుర్‌శర్మ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు ఎక్కువగా నివసించే ఈ నియోజకవర్గంలో పదవీ విరణమ వయసు అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని కేజ్రీవాల్ ప్రచారం చేస్తున్నారు. ఇక నుపుర్ శర్మ... అభివృద్ధి, మహిళాభద్రత, నీటి కొరత, విద్యుత్ తదితర సమస్యలను ప్రధానాంశాలుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిరణ్ వాలియా తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వివరించడమే కాకుండా కేజ్రీవాల్ వైఫల్యాలను వేలెత్తి చూపుతున్నారు.
వీఐపీలు, ప్రభుత్వోద్యోగులకు నెలవైన న్యూఢిల్లీలో... మిగతా నియోజకవర్గాల మాదిరిగా విద్యుత్, తాగునీరు, మౌలిక సదుపాయాల కొరత సమస్యలు కనిపించవు. అవినీతి, ధరల పెరుగుదల, మహిళాభద్రత వంటి అంశాలే ఇక్కడ కీలకంగా మారాయి. 2.65 లక్షల మంది జనాభా కలిగిన ఈ నియోజక వర్గంలో దాదాపు సగం మందికి ఓటు హక్కు లేదు. 1.36 లక్షల మంది ఓటర్లున్న న్యూఢిల్లీలో 37 శాతం మంది ప్రభుత్వోద్యోగులు, 20 శాతం పంజాబీలు, 18 శాతం షెడ్యూల్డ్‌కులాలు, 10 శాతం వైశ్యులు, 10 శాతం మంది బ్రాహ్మణులతోపాటు ఒక శాతం మంది శాతం మురికివాడవాసులుకూడా ఉన్నారు.
‘న్యూఢిల్లీ’లో తేలనున్న అరవింద్ భవిత్యం
Published Wed, Jan 28 2015 10:17 PM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement